News February 24, 2025
SKLM: ఎన్నికల విధులపట్ల అప్రమత్తంగా ఉండాలి

ఉపాధ్యాయ MLC ఎన్నికల విధులపట్ల సంబంధిత పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సహాయ ఎన్నికల అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం జెడ్పీ మందిరంలో ఈనెల 27న ఉపాధ్యాయ MLC ఎన్నికల సంబంధించి ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించే పీవో, ఎపీవోలకు రెండో విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. పోలింగ్ కేంద్రంలో విధులు, పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించారు.
Similar News
News December 22, 2025
శ్రీకాకుళం: పోలియో సిరా చుక్క..ఎందుకంటే?

శ్రీకాకుళం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం 93% పూర్తయినట్లు వైద్యాధికారులు నేడు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 0-5 ఏళ్లున్న చిన్నారులకు రెండు చుక్కల పోలియో డ్రాప్స్ వేసినంతరం ఎడమచేతి చిటికెల వేలుకు చుక్క పెడతారు. దీనికి కారణమేంటంటే..మరొక కేంద్రానికి వెళ్లకుండా, పోలియో చుక్కలు దుర్వినియోగం కాకుండా ఈ విధానం కొనసాగిస్తున్నారు. గతంలో సిరా పెట్టేవారు. ప్రస్తుతం పర్మినెంట్ మార్కర్ పెన్ వాడుతున్నారు.
News December 22, 2025
శ్రీకాకుళం జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ దందా

శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ అండతో కొందరు మాఫియాగా మారి ఇసుక అక్రమ దందా సాగిస్తున్నారు. శివారు గ్రామాలను డంపింగ్ కేంద్రాలుగా మార్చి గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళల్లో భారీ లారీలతో ఒడిశా, హైదరాబాద్‌లకు రవాణా చేస్తున్నట్లు ఊహగానాలున్నాయి. దీంతో నదీ పరీవాహక భూములు కోతకు గురవుతున్నాయి. అధికారికంగా 27 ర్యాంపుల్లో 4.50లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలగా, అనధికారకంగా లక్షల క్యూబిక్ మీటర్లు తరలిందని సమాచారం.
News December 22, 2025
శ్రీకాకుళంలో నేడు పీజీఆర్‌ఎస్

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్‌లో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి సమస్యలను ఫిర్యాదుల రూపంలో నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.


