News April 24, 2024
SKLM: ఎన్నికల సమయంలో మరో ఐఏఎస్ అధికారి బదిలీ

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మరో ఐఏఎస్ అధికారిణిని బదిలీ చేశారు. సీతంపేట ఐటీడీఏ పీఓ, పాలకొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కల్పనా కుమారిని బదిలీ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ డా.కె.ఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ శోభితకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నియమించారు.
Similar News
News November 8, 2025
మాజీ మంత్రి అప్పలరాజుకు నోటీసులు?

మాజీ మంత్రి అప్పలరాజుకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా గతేడాది ప్రభుత్వంపై ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. వీటిపై కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నిమిత్తం విచారణకు రావాలని కోరుతూ సీదిరి ఇంటికి శనివారం వెళ్లి ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారని సమాచారం.
News November 8, 2025
టెక్కలి: యాక్సిడెంట్లో ఒకరు స్పాట్ డెడ్

టెక్కలి-నౌపడ రోడ్డులో రాజగోపాలపురం గ్రామం సమీపంలో శుక్రవారం అర్దరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇజ్జువరపు అప్పన్న(45)అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రాజగోపాలపురం గ్రామస్థుడిగా స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
News November 8, 2025
శ్రీకాకుళం: తండ్రి మందలించాడని కుమారుడు నదిలో దూకేశాడు

శ్రీకాకుళం పట్టణంలో ఐటీఐ చదువుతున్న విద్యార్థి అలుగోలు సాయి నేతాజీ నాగావళి నదిలో శుక్రవారం అర్దరాత్రి దూకాడు. గుజరాతిపేట శివాలయం వీధికి చెందిన సాయి రాత్రి ఇంటికి ఆలస్యంగా రావడంతో తండ్రి మందలించారు. అనంతరం బయటకు వెళ్లి ఏడురోడ్ల వంతెనపై నుంచి నాగావళి నదిలో దూకేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు.


