News February 8, 2025
SKLM: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికి?

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికిస్తుందనే విషయంపై గందరగోళం నెలకొంది. ప్రస్తుత MLC పాకలపాటి రఘువర్మ నామినేషన్ వేసిన సందర్భంగా TDP ఎమ్మెల్సీ చిరంజీవిరావు మాట్లాడుతూ కూటమి మద్దతు రఘువర్మకేనని ప్రకటించారు. అయితే పీఆర్టీయూ, STUల మద్దతుతో పోటీ చేస్తున్న గాదె శ్రీనివాసులు నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్ శుక్రవారం హాజరై మద్దతు ప్రకటించారు.
Similar News
News December 1, 2025
శ్రీకాకుళం: డయేరియాపై మంత్రి అచ్చెన్న ఆరా.!

సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియాతో ఒకరు మృతి చెందడం, పలువురు వ్యాధి భారిన పడిన సంఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం ఆరా తీశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో మాట్లాడి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వైద్య బృందాలను పంపించి వైద్య శిబిరం ఏర్పాటు చేసి, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
News December 1, 2025
శ్రీకాకుళం: కేంద్ర మంత్రి వర్యా ఆశలన్నీ మీపైనే..!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు తద్వారా జిల్లా రైల్వేస్టేషన్లు అభివృద్ధి, పర్లాఖిమిడి-పలాస, కటక్ నూతన రైల్వే లైన్లు, మూలపేట-భోగాపురం కోస్టల్ కారిడార్ రహదారి నిర్మాణం, జిల్లాలో ప్రత్యేక ITDA ఏర్పాటు తదితర అంశాలు ప్రస్తావించాలని ప్రజలు కోరుతున్నారు.
News December 1, 2025
శ్రీకాకుళం జిల్లాలో 8,485 HIV కేసులు.!

జిల్లాలో సుమారు 8,485 HIV కేసులు ఉన్నట్లు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి శ్రీకాంత్ తెలిపారు. అందులో 3,526 మంది పురుషులు, 4,606 మంది స్త్రీలు, 23 ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి, టెక్కలి జిల్లా ఆసుపత్రి, రాగోలులో ART కేంద్రాలతో పాటు ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, కోటబొమ్మాళి,నరసన్నపేట, రణస్థలం,పాతపట్నం,పొందూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ICTC కేంద్రాల ద్వారా మందులు అందిస్తున్నామన్నారు.


