News March 10, 2025
SKLM: ఎస్పీ గ్రీవెన్స్‌లో 52 వినతలు స్వీకరణ

ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ఫిర్యాదులు చేశారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. మొత్తం 52 వినతిపత్రాలు స్వీకరించామన్నారు.
Similar News
News April 11, 2026
టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జి తిలక్‌కు పోలీసుల నోటీసులు

టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జి పేరాడ తిలక్‌పై శుక్రవారం టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు. టెక్కలిలో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలపై నిషేదం ఉన్నప్పటికీ పోలీసులు అనుమతి లేకుండా గురువారం రాత్రి టెక్కలిలో వైసీపీ నాయకులు దిష్టిబొమ్మ దగ్ధం వంటి కార్యక్రమాలు చేయడంపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు నిబంధనలను అతిక్రమించినందుకు పోలీసులు విచారణకు శనివారం తిలక్ హాజరుకావాలని నోటీసులు అందించారు.

News April 10, 2026
శ్రీకాకుళం: ఈ 8 మండలాల్లో రేపు తీవ్ర వడగాల్పులు

శ్రీకాకుళం జిల్లాలో శనివారం 8 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపనుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సరుబుజ్జిలి , సారవకోట, ఆమదాలవలస, బూర్జ, హిరమండలం, జలుమూరు, ఎల్. ఎన్.పేట, పాతపట్నం మండలాల్లో అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.