News December 2, 2024
SKLM: ఎస్పీ స్పందనకు 50 అర్జీలు

ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో సోమవారం ‘మీ కోసం’ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు 50 అర్జీలు అందించారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు.
Similar News
News February 11, 2026
శ్రీకాకుళం: టెన్త్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు

తపాలా శాఖలో బీపీఎం, ఏబీపీఎం, గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 80 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 16లోగా indiapost.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి.
వేతనం వివరాలు:
☞ బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000 – రూ.29,380
☞ ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 – రూ.24,470
News February 11, 2026
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..విశాఖలో IPL మ్యాచ్‌లు

IPL–2026లో విశాఖ వేదిక ఉండనున్నట్లు తెలుస్తోంది. ACA–VDCA స్టేడియంలో కనీసం రెండు మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ వేదికను హోం గ్రౌండ్‌గా ఉపయోగించుకున్న సంగతి తెలిసిందే. ఈ వేదిక DCకి కలిసి రాగా ఈ ఏడాది కూడా మ్యాచుల నిర్వహణకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయమై ఆంధ్ర క్రికెట్ సంఘం DCని సంప్రదించగా ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది.
News February 11, 2026
మహాశివరాత్రి ఉత్సవాలకు కంట్రోల్ రూమ్: కలెక్టర్

సారవకోట మండలం శ్రీముఖలింగం క్షేత్రంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ‘కంట్రోల్ రూమ్’ ఏర్పాటు చేశామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. అధికారులకు కేటాయించిన విధుల్లో శ్రద్ధతో పనిచేయాలన్నారు.


