News January 1, 2025
SKLM: ఎస్సీ కులగణన అభ్యంతరాల స్వీకరణ ఈనెల 7 వరకు పొడిగింపు
ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును ఈనెల 7 వరకు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. డిసెంబర్ 31తో గడువు ముగియడంతో ప్రభుత్వం మరొక వారం రోజులు పొడిగించింది. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కులగణనపై నిర్దేశిత ప్రాంతాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి స్వీకరించిన వివరాలను 11 వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారన్నారు.
Similar News
News January 15, 2025
మెళియాపుట్టిలో వారికి కనుమ రోజే భోగి
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని కోసమాలలో వింత ఆచారం పాటిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని దేవాంగుల వీధిలో కనుమరోజు భోగి జరుపుకోవడం వీరి ప్రత్యేకత. తర తరాలనుంచి ఆనవాయితీగా వస్తున్న ఆచారమని తెలిపారు. ఈ వీధిలో నేత కార్మికులు ఎక్కువగా ఉండటంతో పండగ రోజు కూడా నేత వస్త్రాలు నేయడంలో బిజీగా ఉంటారు. కాబట్టి భోగి రోజు సాధ్యంకాక కనుమ రోజు భోగి జరుపుకోవడం ఆచారంగా వస్తుందన్నారు.
News January 15, 2025
సోంపేటలో పోలీస్ జాగిలాల విస్తృత తనిఖీలు
సోంపేట బస్ స్టేషన్, హోటళ్లు, కిరాణా షాపులలో బుధవారం సోంపేట సీఐ మంగరాజు ఆధ్వర్యంలో పోలీసు జాగిలాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు సీఐ తెలిపారు. మాదకద్రవ్యాల రవాణా, నిషేధిత వస్తువుల కోసం ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నామన్నారు. ఈ తనిఖీలలో పలువురు పోలీసు సిబ్బంది ఉన్నారు.
News January 15, 2025
శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన సినీ నటుడు
శ్రీకాకుళం మండలంలో అరసవల్లి గ్రామంలో ఉండే శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయానికి సినీ నటుడు సాయి కుమార్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. స్వామిని దర్శించుకుని మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ వేదమంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీ యర్రంశెట్టి భద్రాజీ, శ్రీస్వామి వారి జ్ఞాపికను, తీర్థ ప్రసాదాలను అందజేశారు.