News October 19, 2024

SKLM: ఒక్కో ఇంటికి ఒక ఉద్యోగం అవకాశం ఇవ్వాలి- MLA

image

అణు విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తి అయితే ఒక్కో ఇంటికి ఒక ఉద్యోగం అవకాశం కల్పించాలని ఎచ్చెర్ల MLA ఈశ్వరరావు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను కోరారు. శనివారం కలెక్టరేట్‌లో కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం అధికారులతో సమావేశం నిర్వహించారు. కాలనీల్లో షాపింగ్ కాంప్లెక్స్, సచివాలయాలు, ప్రాథమిక పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీ, సైక్లోన్ సెంటర్, బస్సు షెల్టర్, పోస్టాఫీసు ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News December 3, 2025

SKLM: ‘ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ-ఆఫీస్ తప్పనిసరి’

image

వచ్చే వారానికి జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ-ఆఫీసు వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ పరంగా వివిధ శాఖల దస్త్రాలపై సమీక్ష నిర్వహించారు. ఆర్థికపరమైన దస్త్రాల పరిష్కారంలో చొరవ చూపాలన్నారు. ఈ విషయంలో వెనుకబడిన అధికారులుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

News December 2, 2025

ఉత్తరాంధ్రలో పెరిగిన కాలుష్యం

image

ఉత్తరాంధ్రలోని మూడు నగరాల్లో కాలుష్యం పెరిగింది. సోమవారం జరిగిన లోక్‌సభ సమావేశంలో హిందూపూరం MP పార్థసారథి అడిగిన ప్రశ్నకి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సమాధానం ఇచ్చారు. 2017-18తో పోలిస్తే 2024-25లో ఉత్తరాంధ్రలో గాలి నాణ్యత మరింత దిగజారింది. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళంలో పరిశ్రమలు వ్యర్థాలను సరిగ్గా శుద్ధి చేయకపోవడం వల్ల కాలుష్యం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.

News December 2, 2025

తమిళనాడు ప్రమాదం.. 3కి చేరిన శ్రీకాకుళం మృతుల సంఖ్య.!

image

రామేశ్వరం సమీపంలో కారు, టెంపో ట్రావెల్ బస్సును ఢీకొనగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచల, వీర రామచంద్రపురం (కొండూరు) గ్రామాలకి చెందిన ఇద్దరు యువకులు ఇల్లాకుల నవీన్ (25), పైడి సాయి(26) ఘటనా స్థలంలో మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన గుంటరాజు అనే యువకుడు మధురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.