News December 27, 2024

SKLM: ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జవవరి 1 తేదికి సంబంధించిన పింఛన్లను ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1 వ తేది సెలవు దినం కావడంతో డిసెంబర్ 31న (మంగళవారం) పెన్షన్లు పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో 3,13,255 మంది లబ్ధిదారులకు రూ.128.56 కోట్లు అధికారులు ఖాతాలో జమ చేశారు. ఈ మేరకు నగదు పంపిణీకి సిబ్బందితో కలిసి క్షేత్రా స్థాయిలోఅధికారులు చర్యలు చేపట్టారు. 

Similar News

News November 16, 2025

SKLM: బంగారమంటూ పిలిచి.. బురిడీ కొట్టించాడు

image

ప్రేమిస్తున్నాని..పెళ్లి చేసుకుందామని ఆ యువతిని కుర్రాడు నమ్మించాడు. బంగారమంటూ పిలిస్తే..మురిసిపోయిందేమో యువకుడితో పెళ్లికి సిద్ధమైంది. శ్రీకాకుళానికి చెందిన వీరిద్దరూ HYDకు ఈనెల14న బయలుదేరారు. VJAలో బస్సు మారే క్రమంలో నగల బ్యాగ్‌, ఫోన్‌తో పారిపోయాడు. చావే దిక్కని ఏడుస్తున్న ఆమెను కృష్ణలంక పోలీసులు ప్రశ్నిస్తే విషయం తెలిసింది. దర్యాప్తు చేసి నగలతోపాటు యువతిని పేరెంట్స్‌కు నిన్న అప్పగించారు.

News November 16, 2025

SKLM: ‘క్రమశిక్షణ సమర్ధతతో కోర్టు కానిస్టేబుల్‌లు పనిచేయాలి’

image

క్రమశిక్షణ, సమర్ధతతో కోర్టు కానిస్టేబుళ్లు పనిచేయాలని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సంబంధిత కానిస్టేబుల్‌లతో సమావేశం నిర్వహించారు. కేసుల ఛార్జ్ షీట్‌లు దాఖలు చేసిన సమయంలో లోపాలు లేకుండా చూడాలని పబ్లిక్ ప్రాసెక్యూటర్లతో సమన్వయం ముఖ్యమన్నారు. రిఫర్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి సమన్లు, వారంట్లు అమలులో ఆలస్యం జరగరాదాన్నారు. DCRB సీ‌ఐ శ్రీనివాస్ ఉన్నారు.

News November 15, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

image

➤SKLM: క్రమశిక్షణ సమర్థతతో కోర్టు కానిస్టేబుళ్లు పనిచేయాలి
➤వ్యవసాయ రంగంలో AI వినియోగం: మంత్రి అచ్చెన్నాయుడు
➤పలాస, నరసన్నపేటలో 33 కేజీలు గంజాయి స్వాధీనం..నిందితులు అరెస్ట్
➤టెక్కలి: కంటి శస్త్ర చికిత్స విఫలం.. చూపు కోల్పోయిన వృద్ధుడు
➤సోంపేట: చెరువులో మునిగి యువకుడు మృతి
➤ఇచ్ఛాపురం: మత్స్యకారులు మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
➤జిల్లాలో పలుచోట్ల ప్రారంభమైన వరి కోతలు