News July 7, 2024

SKLM: ఒడిశా బీచ్‌‌లో దారుణ హత్య.. ముగ్గురు అరెస్ట్

image

ఇచ్చాపురానికి చెందిన బాలురెడ్డిని ముగ్గురు వ్యక్తులు ఒడిశా బీచ్‌లో దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. మండలంలోని బెల్లుపడకు చెందిన ఏదురు రాజు, బలరాంపురానికి చెందిన బాకి గణేశ్, లొద్దపుట్టికి చెందిన సాలిన దుర్యోధనను నిందితులుగా గుర్తించి ఒడిశా పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. హత్యకు వాడిన కత్తెర, కారు, సెల్‌ఫోన్ రూ.20 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News September 18, 2025

సంతబొమ్మాళి: మూలపేట పోర్టులో కార్మికుడు మృతి

image

సంతబొమ్మాళి (M)మూలపేట పోర్టులో పనిచేస్తున్న కార్మికుడు పింగ్వా(36) గురువారం మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం..జార్ఖండ్‌కు చెందిన పింగ్వా రెండు వారాల కిందట మూలపేట పోర్ట్‌లో కూలీగా పని చేసుందుకు వచ్చాడని, గత మూడు రోజులగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడని చెప్పారు. దీనిపై ఎస్సై నారాయణాస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

News September 18, 2025

ఎచ్చెర్ల: పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో B.Ed 1, 3వ, B.PEd 1వ సెమిస్టర్ల పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ నేడు ఫలితాలను విడుదల చేశారు. యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్‌ https://brau.edu.in/లో ఫలితాలను అభ్యర్థులు చూడవచ్చునన్నారు.

News September 18, 2025

టెక్కలి: గ్రంథాలయాన్ని పరిశీలించిన జిల్లా అధికారి

image

టెక్కలి శాఖా గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శంకర్రావు గురువారం పరిశీలించారు. స్థానిక అధికారిణి రూపావతితో పలు అంశాలపై మాట్లాడిన ఆయన పలు రికార్డులను పరిశీలించారు. గ్రామ పంచాయతీల నుంచి రావాల్సిన సెస్ బకాయిలు వస్తే గ్రంథాలయాల అభివృద్ధికి దోహద పడతాయన్నారు. అనంతరం పాఠకులతో మాట్లాడారు.