News January 30, 2025
SKLM: ఓటర్లు 4829… పోలింగ్ కేంద్రాలు 31

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లా పరిధిలో 4829 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. వారిలో పురుషులు 3275, కాగా మహిళా ఓటర్లు 1554 మంది ఉన్నారని చెప్పారు. అర్హత కలిగిన వారు నామినేషన్ ప్రక్రియ ముగియడానికి పది రోజుల ముందు వరకు అనగా జనవరి 31వ తేదీ సాయంత్రం 03.00 గంటల వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
Similar News
News November 30, 2025
శ్రీకాకుళం: ’65 హాట్స్పాట్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి’

శ్రీకాకుళం జిల్లాలో గంజాయి వినియోగం, అక్రమ రవాణాను సమూలంగా అరికట్టేందుకు అధికారులు గుర్తించిన 65 హాట్స్పాట్ల వద్ద సీసీ కెమెరాలను తక్షణమే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ సమవేశం నిర్వహించారు. కెమెరాల ఏర్పాటు బాధ్యతను స్థానిక సంస్థలు తీసుకోవాలని చెప్పారు.
News November 30, 2025
అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ చేయాలి: శ్రీకాకుళం ఎస్పీ

డిసెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో లోక్ అదాలత్ కేసులు తోపాటు బెయిల్స్, రానున్న ఎన్నికల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. స్వీయ ఒప్పందంతో రాజీకి ప్రోత్సహించాలని తెలిపారు. అదనపు ఎస్పి కెవి రమణ ఉన్నారు.