News March 4, 2025

SKLM: కంటి వ్యాధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

image

గ్రామ స్థాయిలో కంటి వ్యాధులపై ఆప్తాల్మీక్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య DM&HO టీవీ బాలమురళీకృష్ణ అన్నారు. మంగళవారం జిల్లా DM&HO కార్యాలయంలో ఆప్తాల్మిక్ అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ప్రతి ఒక్క ఆప్తాలమిక్ అధికారి వారి పరిధిలో ఎన్జీవో ఆసుపత్రి వారు నిర్వహించే క్యాటరాక్ట్ క్యాంపులను సందర్శించి అంధత్వంతో బాధపడుతున్న వారికి రిఫర్ చేయాలన్నారు.

Similar News

News November 21, 2025

SKLM: ‘జాబ్ కార్డులు కోసం దరఖాస్తుల స్వీకరణ’

image

జాబ్ కార్డుల కోసం ధరఖాస్తులు స్వీకరించనున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సుధాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో గల అన్ని గ్రామ పంచాయితీలలో ఈ నెల 22న గ్రామ సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆయా పంచాయతీలలో గల ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, మండల స్థాయి అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కేవైసీ కారణంగా ఆలస్యమైన జాబ్ కార్డులు పరిశీలించి ఇస్తామన్నారు.

News November 21, 2025

సంతబొమ్మాళిలో మహిళ దారుణ హత్య!

image

సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఆచూకీ లభ్యమయిందని, మర్డర్‌కు గురైనట్లు ఎస్సై నారాయణస్వామి శుక్రవారం తెలిపారు. నందిగామ మండలం కొండబీంపురం గ్రామానికి చెందిన దాసరి పుష్పలత (34) గా పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి వరకు పలు సామాజిక మాధ్యమాల్లో మృతదేహం ఫోటోలను పోస్ట్ చేశారు. ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉందన్నారు.

News November 20, 2025

నౌపడలో గుర్తు తెలియని మహిళ మృతదేహం

image

సంతబొమ్మాళి మండలం నౌపడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పొలంలో గురువారం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సబ్ ఇన్‌స్పెక్టర్ నారాయణస్వామి మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం, మృతురాలి వివరాలు ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.