News March 18, 2025
SKLM: కంప్యూటర్ శిక్షణను ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. నగరంలోని జడ్పీ మందిరంలో 18, 19 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న కంప్యూటర్ శిక్షణా కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. నూతనంగా వస్తున్న సాంకేతికతను అలవర్చుకొని నైపుణ్యాభివృద్థి చేసుకోవాలన్నారు.
Similar News
News March 19, 2025
కవిటిలో యువకుడిపై పోక్సో కేసు నమోదు

సొంత మేనమామ పదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. కవిటి మండలంలోని రాజపురం పంచాయతీ తొత్తిపుట్టుగలో మార్చి11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్యాయంగా చూడాలస్సిన మేనమామ మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి తాళ్లతో కట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నొప్పి భరించలేక బాలిక కేకలు పెట్టడంతో భయపడి పారిపోయాడు. ఈ ఘటనపై డీఎస్పీ వెంకట అప్పరావు కేసు నమోదు చేశారు.
News March 19, 2025
శ్రీకాకుళంలో దంచి కొడుతున్న ఎండలు

శ్రీకాకుళం జిల్లాలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో శ్రీకాకుళం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాహనదారులు, పాదచారులు చాలాచోట్ల మజ్జిగ, పండ్ల రసాలు తాగుతున్నారు. మరో రెండు నెలలు జిల్లాలో ఎండల తీవ్రంగా ఉంటే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారుల, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.
News March 19, 2025
ఎచ్చెర్ల: భార్యపై అనుమానంతో హత్య

ఎచ్చెర్ల మండలంలో భార్యను, భర్త దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. ఎచ్చెర్లలోని సంతసీతాపురానికి చెందిన నాగమ్మ(40), అప్పలరెడ్డి కూలిపనులు చేస్తూ జీవనం సాగించేవారు. భార్యపై అనుమానంతో సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటిలో గొడవపడ్డాడు. క్షణికావేశంలో కత్తితో తల, మెడలపై దాడి చేయగా ఆమె మృతి చెందింది. కుమారుడు త్రినాథ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ అవతారం తెలిపారు.