News November 29, 2024

SKLM: కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజులు పాటు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయనే అంచనాల నేపథ్యంలో యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. ప్రతీ మండల కేంద్రంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కంట్రోల్ రూం ఫోన్ నంబర్ 08942-240557 ఏర్పాటు చేసినట్లు అలాగే డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూంలు సిద్ధం చేసినట్లు వివరించారు.

Similar News

News November 25, 2025

జాతీయస్థాయి పోటీలకు సిక్కోలు విద్యార్థిని ఎంపిక

image

జి.సిగడం కేజీబీవీ ఇంటర్మీడియట్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థిని ఆర్.స్వాతి జాతీయస్థాయి పరుగు పందేనికి ఎంపికైంది. హర్యానాలో ఈ నెల 26 నుంచి 30 వరకు అండర్-19 క్యాటగిరీలో 4×100 రిలే పరుగు పందెంలో పాల్గొననుంది. రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రదర్శనతో జాతీయస్థాయికి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రమీల తెలిపారు. విద్యార్థినిని ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.

News November 24, 2025

శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 52అర్జీలు

image

శ్రీకాకుళం ఎస్పీ కార్యలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమానికి 52 ఫిర్యాదులు వచ్చాయి. వాటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. తన దృష్టికి వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నామని చెప్పారు. వారితో ముఖాముఖి మాట్లాడి, సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.

News November 24, 2025

అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

image

సమస్యల పరిష్కారానికి అధికారులందరూ సమన్వయంతో పనిచేసి, ప్రజా సమస్యల పరిష్కార వేదిక లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 127 ఫిర్యాదులు అందాయాన్నారు. ప్రతి దరఖాస్తు వ్యక్తిగత శ్రద్ధతో పరిశీలించి ప్రజలకు తృప్తి కలిగించే విధంగా నిర్ణీత గడువులో పరిష్కరించాలన్నారు.