News January 25, 2025
SKLM: కలెక్టర్‌కు రాష్ట్రస్థాయి అవార్డ్

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఎన్నికల అధికారిగా అవార్డు లభించింది. శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ అవార్డును ప్రదానం చేశారు. 2024 ఓటర్ల జాబితా రూపకల్పన, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో అత్యుత్తమ పని కనబరిచినందుకు ఈ అవార్డు అందుకున్నట్లు తెలిపారు.
Similar News
News July 9, 2025
శ్రీకాకుళం: 22 పీఏసీఎస్ సంఘాలకు ఛైర్మన్ల నియామకం

శ్రీకాకుళం జిల్లాలో 22 పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు)కు ఛైర్మన్‌లను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలో 36 పీఏసీఎస్ సంఘాలు ఉండగా 22 పీఏసీఎస్ సంఘాలకు ఛైర్మన్ల నియామకం పూర్తయింది. వీరు వచ్చే ఏడాది జూలై 30వ తేదీ వరకు కొనసాగుతారు. ఒక పీఏసీఎస్ సంఘానికి ఛైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులను నియమించారు.
News July 9, 2025
హత్యాయత్నం కేసులో నిందితుడికి నాలుగేళ్లు జైలు: ఎస్పీ

మందస పోలీస్ స్టేషన్‌లో 2018లో నమోదైన హత్యాయత్నం, గృహహింస కేసులో నిందితుడికి 4 ఏళ్లు జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధించినట్లు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మంగళవారం తెలిపారు. మందసకు చెందిన సూర్యారావు తన భార్య నిర్మలపై హత్యాయత్నం చేశాడు. నేరం రుజువైనందున అసిస్టెంట్ సెషన్ సోంపేట కోర్టు జడ్జి శిక్ష ఖరారు చేసినట్లు వివరించారు.
News July 9, 2025
రేపు శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ డ్రైవ్

శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం మెగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీరాములు, ఇంటెల్లిరేస్ సీఈఓ ఆర్. నరేంద్ర మంగళవారం తెలిపారు. ఈ మేళాలో పాల్గొనే వారు డిప్లొమా, ఐటిఐ, ఇంటర్, డిగ్రీ, బి.టెక్ విద్యార్హత ఉండాలన్నారు. 28 ఏళ్ల లోపు ఉన్న యువతి, యువకులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న యువత సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో మేళాలో పాల్గొనాలని కోరారు.