News January 26, 2026

SKLM: కలెక్టర్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చిన పోలీస్ జాగిలం

image

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయానికి చెందిన పోలీస్ జాగిలం (మున్నా డాగ్ ) కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కు సోమవారం షేక్ హ్యాండ్ ఇచ్చింది. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా కలెక్టర్‌కు స్వాగతం పలుకుతూ ముందుగా పుష్పగుచ్ఛం అందజేసింది. సలాం చేస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చి గ్రౌండ్లో ఉన్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Similar News

News April 20, 2026

శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

image

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

image

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.