News January 29, 2025

SKLM: కుంభ మేళాకి ప్రత్యేక బస్సులు 

image

కుంభమేళాకి శ్రీకాకుళం బస్ స్టేషన్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి, ఏ.విజయకుమార్ బుధవారం తెలిపారు. శ్రీకాకుళం బస్ స్టేషన్ ఆవరణలో కుంభమేళాకి సంబంధించిన కరపత్రాలను/బ్యానర్లను ఆవిష్కరించారు. టికెట్లు www.apsrtconline.in ద్వారా శ్రీకాకుళం బస్ స్టేషన్‌లో పొందవచ్చని సూచించారు. వివరాలకు 99592 25608, 99592 25609, నంబర్‌లను సంప్రదించాలన్నారు.

Similar News

News October 21, 2025

శ్రీకాకుళం: ‘RTCలో 302 మందికి ప్రమోషన్లు’

image

శ్రీకాకుళం APRTC డివిజన్ పరిధిలో 23 కేటగిరిల్లో విధులు నిర్వహిస్తున్న 302 మందికి ప్రమోషన్లు కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆదివారం, సోమవారం ప్రమోషన్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన తెలియజేశారు. రెండు, మూడు రోజుల్లో జాబితా ప్రకటిస్తామని ఆయన వివరించారు.

News October 20, 2025

శ్రీకాకుళం మీదుగా స్పెషల్ ట్రైన్స్

image

అదనపు రద్దీని తగ్గించేందుకు భువనేశ్వర్-యశ్వంతపూర్-భువనేశ్వర్(02811/22) మధ్య స్పెషల్ ట్రైన్ ఈనెల 29వ తేదీ వరకు నడపనున్నట్లు తూర్పు ప్రాంత రైల్వే శాఖ జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విశాఖపట్నం-బెంగళూరు-విశాఖపట్నం(08581/82) మధ్య ఈనెల 30వ తేదీ వరకు రైళ్లు నడుస్తాయి. శ్రీకాకుళంరోడ్డు, పలాస స్టేషన్లతో పాటు రాజమండ్రి, విజయవాడ, నెల్లూరులో ఈ రైళ్లు ఆగుతాయి.

News October 20, 2025

SKLM: డిగ్రీ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైది. ఈ మేరకు యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల విభాగం అధికారి జి.పద్మారావు ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు ఈనెల 31వ తేదీ లోపు పరీక్ష ఫీజును యూనివర్సిటీ లేదా కాలేజీల్లో చెల్లించాలని సూచించారు. పరీక్షలు నవంబర్ 25వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని చెప్పారు.