News December 24, 2024
SKLM: కుష్ఠు వ్యాధిపై పోస్టర్ ఆవిష్కరణ

జనవరి 22 నుంచి ఫిబ్రవరి 22 వరకు కుష్ఠు వ్యాధిపై సర్వే చేస్తారని DM&HO డాక్టర్ బి.మీనాక్షి వివరించారు. ఈ సందర్భంగా కుష్ఠు వ్యాది పై పోస్టర్ను జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆవిష్కరించారు. సర్వేకు వచ్చే ఆరోగ్య సిబ్బందికి అందరూ సహకరించాలని ఆమె కోరారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి. మీనాక్షి, ఇన్ఛార్జ్ డీఆర్ఓ అప్పారావు ఉన్నారు.
Similar News
News October 19, 2025
సిక్కోలులో శైవక్షేత్రాలు ఇవే..!

దీపావళి తర్వాత కార్తీకమాసం ప్రారంభం కానుంది. చాలామంది శైవక్షేత్రాలను దర్శించి దీపారాధన చేస్తుంటారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని రావివలస ఎండల మల్లిఖార్జునస్వామి దేవస్థానం, శ్రీముఖలింగం- ముఖలింగేశ్వరస్వామి, పలాస-స్వయంభూలింగేశ్వరస్వామి, పాతపట్నం-నీలకంటేశ్వరస్వామి, శ్రీకాకుళంలోని ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 21 నుంచి కార్తీకమాస పూజలు చేయనున్నారు.
News October 19, 2025
ప్రేమికుల వివాదంలో కూన పేరు.. ఖండించిన MLA

ఆముదాలవలస MLA కూన రవికుమార్పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. ‘మా అమ్మాయిని ఓ యువకుడు ఐదేళ్లు ప్రేమించాడు. పెళ్లికి ఒప్పుకొని ఇప్పుడు చేసుకోనంటున్నాడు. వాళ్ల వెనుక ఎమ్మెల్యే కూన ఉన్నారంటూ యువకుడు బెదిరిస్తున్నాడు. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు’ అని ఆమె వాపోయింది. కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆ ఆరోపణలను MLA ఖండించారు.
News October 19, 2025
శ్రీకాకుళం: ఇంటికొస్తూ యువకుడి మృతి

దీపావళి కోసం ఇంటికొస్తూ ఓ వ్యక్తి చనిపోయిన విషాద ఘటన ఇది. ఇచ్ఛాపురం(M) లొద్దపుట్టికి చెందిన వసంత్ కుమార్(32), బెల్లుపడ అచ్చమ్మపేటకు చెందిన సంధ్యకు మార్చిలో పెళ్లి జరిగింది. వసంత్ కుమార్ విజయవాడలో పనిచేస్తూ అక్కడే కాపురం పెట్టాడు. దీపావళి కోసం బైకుపై ఇద్దరూ స్వగ్రామానికి శనివారం బయల్దేరారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద హైవేపై ఆగిఉన్న లారీని ఢీకొట్టారు. భర్త చనిపోగా భార్య తీవ్రంగా గాయపడింది.