News December 29, 2024

SKLM: కోనేరు హంపికి మంత్రి అచ్చెన్న అభినందనలు

image

ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఘన విజయం సాధించిన కోనేరు హంపిని మంత్రి అచ్చెన్నాయుడు అభినందించారు. ఈ మేరకు ఆదివారం పార్టీ కార్యలయం ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. కోనేరు హంపి గెలుపు దేశానికి గర్వకారణమన్నారు. రెండోసారి ప్రపంచ టైటిల్‌ను సాధించిన ఆమె ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. మహిళలు హంపిను ఆదర్శంగా తీసుకోని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

Similar News

News February 26, 2026

శ్రీకాకుళం: గూడ్స్ రైలు నుంచి విడిపోయిన బోగీలు

image

మందస మండలం మకరజోల వద్ద విశాఖ నుంచి కోల్‌కతా వైపునకు వెళ్తున్న గూడ్స్ రైలు ఆరు బోగీలు విడిపోయాయి. మిగిలిన బోగీలతో 100 మీటర్లు ముందుకు వెళ్లి నిలిపివేశారు. దీంతో మకరజోల మీదుగా ఉద్దానం గ్రామాలకు వెళ్లే రహదారిపై రైలు క్రాసింగ్ వద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు గంటపాటు ఇబ్బందులు పడ్డారు.

News February 26, 2026

శ్రీకాకుళం జిల్లాకు కొత్త ఆఫీసర్

image

శ్రీకాకుళం జిల్లా పంచాయతీ అధికారిగా కె. గోపి బాలను ప్రభుత్వం నియమించింది. బుధవారం రాత్రి ప్రస్తుతం డీపీవోగా పనిచేస్తున్న భారతి సౌజన్యను బదిలీ చేశారు. గోపి బాల శ్రీకాకుళం డివిజనల్ పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తుండగా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం.

News February 26, 2026

డయేరియా.. శ్రీకాకుళానికి రూ.118 కోట్లు

image

శ్రీకాకుళం నగరంలో తాగునీరు, డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి పనుల కోసం రూ.118 కోట్లు కేటాయిస్తున్నామని మంత్రి నారాయణ బుధవారం వెల్లడించారు. దమ్మలవీధి, మొండేటి వీధి, కండ్రవీధి, ఎచ్చెర్ల వీధి ప్రాంతాల్లో ప్రబలిన డయేరియా అదుపులోకి వచ్చిందన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి బాధిత ప్రాంతాల్లో పర్యటించారు.