News October 20, 2024

SKLM: కోర్టు కానిస్టేబుల్ విధులు కీలకం: ఎస్పీ

image

శిక్షలు శాతం పెరిగేందుకు కోర్టు కానిస్టేబుల్ విధులే కీలకమని జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఎస్పీ కార్యాలయంలో కోర్టు కేసులు, హాజరు పరచడం, కేసు అభియోగ పత్రాలు, ఇతర అంశాలపై సమీక్షా నిర్వహించారు. కోర్టు విధులలో భాగంగా ప్రతి ఒక్కరు బాధ్యత, అంకితభావంతో పని చేయాలని ఎస్పీ సూచించారు. ఎస్పీ వెంట ఎస్ఐ పారినాయుడు ఉన్నారు.

Similar News

News January 9, 2026

‘రథసప్తమి’కి అంకురార్పణ

image

సూర్య భగవానుడి జన్మదినోత్సవమైన రథసప్తమి వేడుకలను ఈ ఏడాది ఏడు రోజుల పాటు రాష్ట్ర పండుగగా వైభవంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శుక్రవారం ఉదయం అరసవల్లి దేవస్థాన ప్రాంగణంలో ‘కర్టెన్ రైజర్’ కార్యక్రమంతో రథసప్తమి ఉత్సవాలకు అధికారికంగా అంకురార్పణ చేశారు. జనవరి 19 నుంచి 25 వరకు ఏడు రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.

News January 9, 2026

శ్రీకాకుళం: ప్రభుత్వ న్యాయవాదిగా ఇప్పిలి తాత నియామకం

image

శ్రీకాకుళం జిల్లా కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా ఇప్పిలి తాతను ప్రభుత్వం నియమించింది. గురువారం సాయంత్రం ఈ ఆదేశాలు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ పదవిలో తను మూడేళ్లు కొనసాగుతానని చెప్పారు. గతంలో ఈయన నరసన్నపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. పలువురు న్యాయవాదులు ఆయనను అభినందించారు.

News January 9, 2026

SKLM: డిగ్రీ విద్యార్థులకు అలర్ట్

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషన్‌ను పరీక్షల విభాగం అధికారి పద్మారావు గురువారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. విద్యార్థులు పరీక్ష ఫీజును ఈనెల 18వ తేదీ లోపు కళాశాలల్లో, యూనివర్సిటీలో చెల్లించాలని సూచించారు. పరీక్షలు ఫిబ్రవరి మొదటి వారం నుంచి నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు కాలేజీలకు సంప్రదించాలన్నారు.