News December 25, 2024
SKLM: క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ
శ్రీకాకుళం జిల్లా క్రైస్తవ సోదర, సోదరీమణులకు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. క్రైస్తవ సోదరులు ఎంతో పవిత్రంగా భావించి క్రిస్మస్ పండగ జరుపుకోనున్న ప్రతి ఒక్కరుకి జిల్లా ఎస్పీ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ పండగ వేళ ప్రతి ఒకరు జీవితంలో వెలుగులు రావాలని చెప్పారు. దేవుడు మీ పట్ల దయ చూపాలని పేర్కొన్నారు.
Similar News
News January 20, 2025
శ్రీకాకుళం: వివాహిత హత్య.. పరిశీలించిన ఎస్పీ
శ్రీకాకుళం రెండో పోలీసు స్టేషన్ పరిధిలో గల న్యూ కాలనీలో ఆదివారం రాత్రి సమయంలో పూజారి కళావతి అనే ఆమె హత్యకు గురైంది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి హత్య ప్రదేశాన్ని ఆదివారం అర్ధరాత్రి హుటాహుటిన సందర్శించి బాధితులతో హత్య ఘటనకు కారణాలు ఆరా తీశారు. అదేవిధంగా నేర ప్రదేశాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేశామని ఆయన స్పష్టం చేశారు.
News January 20, 2025
SKLM: నేటి నుంచి ఉచిత పశు వైద్య శిబిరాలు
శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 20 నుంచి 31వతేదీ వరకు అన్ని మండలాల్లో రోజుకు రెండు పంచాయితీల చొప్పున పశు వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆ శాఖ జేడీ డాక్టర్ కె.రాజ్ గోపాల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా గ్రామాల్లో ఉదయం 8 గంటల నుంచి ఈ శిబిరాలు నిర్వహిస్తామని, పశువులకు సాధారణ చికిత్సలు, గర్భకోస వ్యాధులకు పరీక్షలు చేసి మందులు అందిస్తామన్నారు.
News January 19, 2025
ఇచ్ఛాపురం: రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరు మృతి
ఇచ్ఛాపురం పట్టణంలోని సంతపేట వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశా రాష్ట్రం బోనసాల ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సంతపేట వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు బలంగా ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా, సోంపేట ప్రాంతానికి చెందిన మరో ముగ్గురు వ్యక్తులను గాయపడ్డారు. క్షతగాత్రులను ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.