News January 2, 2025
SKLM: ఖేల్‍రత్న అవార్డు గ్రహీతలకు మంత్రి అభినందన
ఖేల్‍రత్న అవార్డు గ్రహీతలను మంత్రి అచ్చెన్నాయుడు అభినందించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం నుంచి గురువారం ప్రకటన విడుదల చేశారు. షూటింగ్‍లో ఒలింపిక్స్ పతక విజేత మనుబాకర్, ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్‍కు, హాకీ క్రీడాకారుడు హర్మన్‍ప్రీత్ సింగ్, పారా అథ్లెటిక్స్ విభాగంలో ప్రవీణ్‍కుమార్‌లకు ఖేల్‍రత్న అవార్డులు ప్రకటించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు ఈ అవార్డులు అందుకోవాలన్నారు.
Similar News
News January 14, 2025
శ్రీకాకుళం: పండగ పూట కుటుంబంలో విషాదం
టెక్కలి హైవేపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దసాన గ్రామానికి చెందిన జి. అప్పారావు <<15148221 >>మృతి <<>>చెందిన విషయం తెలిసిందే. ఈయన విశాఖలో కూలి పనులు చేస్తూ కుటుంబంతో జీవనం సాగించేవాడు. పండగకు సోదరిని పిలిచేందుకు ఆదివారం గ్రామానికి వచ్చాడు. తిరిగి వెళ్తున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా HYD వెళ్తున్న బస్సు ఢీకొంది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News January 14, 2025
శ్రీకాకుళం: కొట్లాట ఘటనలో నలుగురిపై కేసు నమోదు
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తిర్లంగిలో సోమవారం జరిగిన కొట్లాట ఘటనలో ఇరువర్గాలకు చెందిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన జీ.చిట్టిబాబు, ఎస్.విశ్వనాథం మధ్య నెలకొన్న చిన్నపాటి వివాదం కొట్లాటకు దారి తీసింది. దీంతో వారు కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ ఏ.విజయ్ కుమార్ తెలిపారు.
News January 14, 2025
SKLM: కళాశాల విద్యార్థిని అదృశ్యం
శ్రీకాకుళం పాత్రునివలసలోని ఓ కళాశాలకు చెందిన విద్యార్థిని అదృశ్యమైంది. కళాశాలకు ఈ నెల 11 నుంచి సంక్రాంతి సెలవులు కావడంతో ఇంటికి వస్తానని చెప్పి రాలేదని తండ్రి శ్రీకాకుళం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్సై రాము తెలిపారు.