News January 23, 2025

SKLM: గణతంత్ర దినోత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు

image

76వ భారత గణతంత్ర దినోత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూచించారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ ఆదివారం ఉదయం వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తమైందని ఆయన చెప్పారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఎస్పీ కెవీ.మహేశ్వర్ రెడ్డితో కలసి వేడుకల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

Similar News

News November 26, 2025

శ్రీకాకుళం జిల్లాలో మార్పులు ఇవే..!

image

శ్రీకాకుళం జిల్లా పలాస రెవెన్యూ డివిజన్‌లోని నందిగం మండలాన్ని టెక్కలి డివిజన్‌లోకి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పలాస రెవెన్యూ డివిజన్ 2022 ఏప్రిల్ 4న ఏర్పాటైంది. ఈ డివిజన్ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి. ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, మందస, నందిగాం, పలాస, సోంపేట, వజ్రపుకొత్తూరు మండలాలు ఈ డివిజన్‌లో ఉన్నాయి. తాజాగా నందిగం మండలాన్ని టెక్కలి డివిజన్‌లోకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

శ్రీకాకుళం రానున్న శాసనసభ అంచనాల కమిటీ: కలెక్టర్

image

రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ ఈ నెల 27న జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం తెలిపారు. శ్రీకూర్మాం చేరుకొని శ్రీకూర్మనాధ స్వామి దేవాలయాన్ని సందర్శిస్తారన్నారు. రాత్రి శ్రీకాకుళం ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో బస చేసి 28న శ్రీ అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని దర్శనం చేసుకుంటారని వివరించారు.