News July 14, 2024
SKLM: చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు.. సీదిరి అప్పలరాజుపై ఫిర్యాదు

మాజీ మంత్రి అప్పలరాజుపై MLA గౌతు శిరీష కాశీబుగ్గ PSలో శనివారం ఫిర్యాదు చేశారు. ‘అప్పలరాజు మంత్రిగా ఉన్న సమయంలో శాసనసభలో నోరు పారేసుకున్నారు. చంద్రబాబు మానసిక పరిస్థితి బాగాలేదని ఒక వైద్యుడిగా ధ్రువీకరిస్తానన్నారు. జగన్ ప్రాపకం కోసం చంద్రబాబును ఆసుపత్రికి పంపి మానసిక పరిస్థితి బాగైన తరువాతే అసెంబ్లీలోకి అడుగు పెట్టించాలన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన అప్పలరాజుపై చర్యలు తీసుకోవాలి’ అని కోరారు.
Similar News
News October 29, 2025
ఎచ్చెర్ల: నేడు అంబేడ్కర్ యూనివర్సిటీ సెలవు

మొంథా తుఫాన్ నేపథ్యంలో ఎచ్చెర్ల డా.బీ.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీకి బుధవారం కూడా సెలవును పొడిగించారు. జిల్లాలో వర్షాలు నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు యూనివర్సిటీతో పాటు జిల్లాలో అనుబంధ ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా.బీ.అడ్డయ్య మంగళవారం వెల్లడించారు. తుఫాన్ నేపథ్యంలో విద్యార్థులు భద్రత దృష్ట్యా సెలవును ప్రకటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News October 29, 2025
అక్టోబర్, నవంబర్ నెలల్లో సిక్కోలును వణికించిన తుఫాన్లు ఇవే..!

1968 నవంబర్లో వచ్చిన భారీ తుఫాన్ ఉద్దానంతో పాటు జిల్లాపై ప్రభావం చూపింది. 1995 నవంబరులో 180 కిమీ వేగంతో వీచిన గాలులు తుఫాన్తో పంటలు, చెట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 1999 సూపర్ సైక్లోన్ జిల్లాను కుదిపేసింది. 2010 జలసైక్లోన్లో లక్షల హెక్టార్లలో పంట దెబ్బతింది. 2012, 2013నీలం, పైలాన్ తుఫాన్లు తీరప్రాంతాల్లో కల్లోలం సృష్టించాయి. 2014, 2018 హుద్ హుద్, తిత్లీ విధ్వంసం నేటికీ జిల్లా ప్రజలు మర్చిపోలేదు.
News October 29, 2025
శ్రీకాకుళం: ప్రభుత్వ ఆసుపత్రుల్లో 37 మంది ప్రసవాలు

తుఫాన్ నేపథ్యంలో 27, 28 తేదీల్లో 37 మంది గర్భిణిలు ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయినట్లు DCH కళ్యాణ్ బాబు మంగళవారం తెలిపారు. టెక్కలి 12, ఇచ్ఛాపురం 5, సోంపేట 2, నరసన్నపేట1, రణస్థలం 1లలో ప్రసవాలు జరిగాయన్నారు. నరసన్నపేట 8, పాతపట్నం 3, రణస్థలం 2, ఆమదాలవలస 1, హరిపురం-1, పొందూరు-1 ప్రసవాలు జరిగాయన్నారు. కోటబొమ్మాళి CHCలో గుండె పోటుతో వచ్చిన మహిళకు సుమారు రూ.40 వేల విలువచేసే ఇంజక్షన్ ఇచ్చినట్లు తెలిపారు.


