News July 14, 2024
SKLM: చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు.. సీదిరి అప్పలరాజుపై ఫిర్యాదు
మాజీ మంత్రి అప్పలరాజుపై MLA గౌతు శిరీష కాశీబుగ్గ PSలో శనివారం ఫిర్యాదు చేశారు. ‘అప్పలరాజు మంత్రిగా ఉన్న సమయంలో శాసనసభలో నోరు పారేసుకున్నారు. చంద్రబాబు మానసిక పరిస్థితి బాగాలేదని ఒక వైద్యుడిగా ధ్రువీకరిస్తానన్నారు. జగన్ ప్రాపకం కోసం చంద్రబాబును ఆసుపత్రికి పంపి మానసిక పరిస్థితి బాగైన తరువాతే అసెంబ్లీలోకి అడుగు పెట్టించాలన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన అప్పలరాజుపై చర్యలు తీసుకోవాలి’ అని కోరారు.
Similar News
News October 12, 2024
శ్రీకాకుళం: దసరా.. మీ VILLAGE స్పెషల్ ఏంటి?
దసరా పండుగ అనగానే పల్లె గుర్తుకొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, స్నేహితులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. పల్లెల్లో తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.
News October 12, 2024
శ్రీకాకుళం జిల్లాలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు
జిల్లాలోని KGBVల్లో ఖాళీగా ఉన్న 36 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వాచ్ ఉమెన్, చౌకీదార్ పోస్టులకు కనీసం ఏడో తరగతి పాస్ అయి ఉండాలి. మిగతా పోస్టులకు నిర్దిష్ట విద్యార్హత లేదు. వయస్సు 21 నుంచి 42 వరకు కాగా, కుల ప్రాతిపదికన(47), వికలాంగులకు(52) వయస్సు పొడిగింపు ఉంది. అర్హత గలవారు ఈ నెల 15లోగా ఆయా మండలాల MEO కార్యాలయాల్లో దరఖాస్తులు అందించాలి.
News October 12, 2024
శ్రీకాకుళం జిల్లాలో వీళ్ల టార్గెట్ ఒంటరి మహిళలే
ఖాళీగా ఉన్న ఇళ్లు, ఒంటరి వృద్ధులు, మహిళలే లక్ష్యంగా చేసుకుని <<14332419>>చోరీలకు<<>> పాల్పడుతున్న రాజగోపాల్, కిరణ్ తండ్రికొడుకులను శ్రీకాకుళం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాజగోపాల్ ముందుగా రెక్కీ నిర్వహించి వృద్ధులు, మహిళలు ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడతారన ఎస్పీ వెల్లడించారు. వారి వద్ద రూ.7.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. కాగా వారికి ఓ మహిళ కూడా సాయపడినట్లు తెలిపారు.