News June 14, 2024
SKLM: చిట్టీల పేరిట రూ.కోటి కాజేసిన యువకుడు
కొత్తూరు మండలం కుంటిభద్రకు చెందిన ఓ యువకుడు చిట్టీల పేరిట రూ.కోటికి పైగా టోపీ పెట్టాడని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు యువకుడు కొందరి నుంచి ప్రతి నెల చిట్టీపాట పేరుతో నగదు తీసుకొని తిరిగి చెల్లించకుండా గత కొన్ని నెలలుగా తప్పించుకు తిరుగుతున్నాడని ఆరోపించారు. బాధితులు వెళ్లి ఊరి పెద్దల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కాగా.. దీనిపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Similar News
News September 14, 2024
శ్రీకాకుళం: అధ్వానంగా రోడ్డు
శ్రీకాకుళం వెళ్లే మార్గమధ్యలో రాగోలు వద్ద రోడ్డు అధ్వానంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ రోడ్డు మొత్తం బుదరమయంగా మారింది. భారీ వాహనాలు కొన్ని బుదరలో కూరుకుపోయాయి. ఈ మార్గలో రాకపోకలు సాగించే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే వారు ఇబ్బంది పడుతున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మీ ఏరియాలోనూ రోడ్లు ఇలాగే ఉన్నాయా? ఉంటే ఎక్కడో కామెంట్ చేయండి.
News September 13, 2024
ఇచ్చాపురం: కిడ్నీ వ్యాధితో మరొకరి మృతి
సిక్కోలు జిల్లాలో కిడ్నీ రోగానికి మరొకరు బలయ్యారు. ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామం ఆశి వీధికి చెందిన దల్లి గురుమూర్తి(39) కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈక్రమంలో శుక్రవారం చనిపోయారు. ఆయనకు భార్య మాణిక్యం, ఇద్దరు కుమార్తెలు గీతా, శ్రావణి, కుమారుడు తేజ ఉన్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులపై ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
News September 13, 2024
శ్రీకాకుళం మెప్మా పీడీగా ఎస్వీ రమణ
శ్రీకాకుళం మెప్మా పీడీగా విధులు నిర్వహిస్తున్న ఎం.కిరణ్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మెప్మా కార్యాలయంలో ఏవోగా విధులు నిర్వహిస్తున్న ఎస్వీ రమణ పీడీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కిరణ్ కుమార్‌కు స్థానిక కార్యాలయ సిబ్బంది వీడ్కోలు పలికారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రమణకు అభినందనలు తెలిపారు.