News December 22, 2024
SKLM: చైన్ స్నాచింగ్స్‌కు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
కవిటి పోలీసు స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్స్‌కు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మహేశ్వర రెడ్డి మీడియాతో వివరాలు వెల్లడించారు. ఇదే వ్యక్తి కవిటి, కంచిలి, ఇచ్చాపురం పట్టణాల్లో చోరీలకు పాల్పడుతున్నారని అన్నారు. రూ.7,76,958 మొత్తం విలువ గల ఎనిమిదిన్నర తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Similar News
News January 20, 2025
SKLM: ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 58 అర్జీలు
మీకోసం కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో సోమవారం మీకోసం ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు వినతులు అందించారు. తన దృష్టికి వచ్చిన వాటిని సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. మొత్తం 58 అర్జీలు వచ్చాయని ఎస్పీ వెల్లడించారు.
News January 20, 2025
శ్రీకాకుళం: కొత్తపేట తీరానికి చేరుకున్న తరుణ్ మృతదేహాం
పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన జంగం తరుణ్(16) ఈ నెల 17వ తేదీన సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతైన సంగతి తెలిసిందే. పోలీసులు నాలుగు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం కొత్తపేట తీరానికి చేరిందని ఎస్సై నిహార్ తెలిపారు. దీంతో వజ్రపుకొత్తూరు మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News January 20, 2025
శ్రీకాకుళం: ఎల్సీడీసీ కాంపెయిన్ ప్రారంభించిన డీఎంహెచ్ఓ
లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ (ఎల్సిడిసి)-2025 ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బాలమురళీకృష్ణ సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ఫిబ్రవరి 2వ తేదీ వరకు 14 రోజుల పాటు జరుగునున్న ఈ సర్వేలో సీహెచ్వోలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యులకు పరీక్షలు చేస్తారని తెలిపారు. అదనపు డీఎంహెచ్ఓ డా. శ్రీకాంత్, డా.మేరీ కేథరిన్, డా.ప్రవీణ్, డీపీఎంఓ వాన సురేశ్ పాల్గొన్నారు.