News October 21, 2024
SKLM: జిల్లాస్థాయిలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున పరిస్థితి ఎదుర్కొనేందుకు అధికారులంతా సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. ఆదివారం అధికారులతో కలసి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా స్థాయిలో శ్రీకాకుళం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08942-240557 ఏర్పాటు చేయడమైనదన్నారు. తుఫాన్ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని కోరారు.
Similar News
News October 26, 2025
RAINS: శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక అధికారిగా చక్రదర్ బాబు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను తీవ్ర వాయుగుండం రూపంలో దూసుకొస్తుంది. ఈ తుఫాను నుంచి జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక అధికారిగా IAS చక్రదర్ బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో జిల్లా JC గా పనిచేసిన అనుభవం ఇతనికుంది.
News October 26, 2025
SKLM: పొట్ట దశలో పైర్లు.. వర్షం పొట్టన పెట్టుకోవద్దని వేడుకోలు!

జిల్లా వ్యాప్తంగా అన్నదాతల్లో మొంథా తుఫాన్ రాక గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. నాలుగైదు రోజులు తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన నేపథ్యంలో పంటలపై ఎంతమేర ప్రభావం చూపుతుందో అని ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా పంట వేసిన నుంచి అనేక ఆటుపోట్లు, యూరియా పాట్లు ఎదుర్కొన్న అనంతరం వరి పైరు ప్రస్తుతం పొట్ట దశలో ఉంది. ఇలాంటి సమయంలో ఏ నష్టం జరగొద్దని రైతన్నలు దేవుడికి మొక్కుకుంటున్నారు.
News October 26, 2025
పాతపట్నం: ‘గురుకుల పాఠశాలను సందర్శించిన సమన్వయ అధికారి’

10వ తరగతి, ఇంటర్ పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకోవాలని, విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని సాంఘిక సంక్షేమ గురుకులాల జిల్లా సమన్వయ అధికారి వై.యశోద లక్ష్మీ అన్నారు. పాతపట్నం మండలంలోని ప్రహరాజపాలెంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలను శనివారం సందర్శించారు. విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని, డార్మెటరీని, మరుగుదొడ్లను పరిశీలించారు.


