News March 15, 2025

SKLM: జిల్లా అధికారులతో.. కేంద్ర మంత్రి సమీక్ష

image

శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు శుక్రవారం పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో జడ్పీ సీఈఓ, పీడీ DWMA, ఈఈ పంచాయతీ రాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనుల గురించి ఆయన సమీక్షించారు. పనులు వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

Similar News

News April 17, 2026

శ్రీకాకుళం: 912 పంచాయతీల్లో ఓటర్లు ఎంతమందంటే?

image

స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. అన్ని పంచాయతీల్లో ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తోంది. జిల్లాలో 912 పంచాయతీలు ఉండగా, 16,22,067 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో, రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు జిల్లా పంచాయతీల్లో ఉన్నారు. గ్రామస్థాయిలో పారదర్శక ఓటర్ల జాబితా కూర్పుపై ఎన్నికల సంఘం కసరత్తు పెట్టింది.

News April 17, 2026

జనగణనపై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

image

జనగణనపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్, ముఖ్య జనగణన అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులు, ఉద్యోగులతో శుక్రవారం ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. స్వీయ-గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఉంటుందన్నారు. దేశానికి స్వీయ గణన ఎంతో అవసరమన్నారు. మొబైల్ యాప్ (టెక్నాలజీ) వాడుకొనే జనగణనాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు.