News July 1, 2024
SKLM: జిల్లా వ్యాప్తంగా 21,92,15 మందికి పెన్షన్లు అందజేత

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సోమవారం మధ్యాహ్నం 12.55 గంటలకు 21,92,15 మందికి పెన్షన్లు అధికారులు అందజేశారు. జిల్లా మొత్తం 3,19,702 పెన్షన్లు కాగా అధికారులు సచివాలయ సిబ్బందితో నేరుగా పెన్షన్ల అందజేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో కూటమి నాయకులతో సహా ఉద్యోగులు శతశాతం పెన్షన్లు పంపిణీ పనిలో ఉన్నారు. పెన్షన్లు అందుకున్న లబ్ధిదారులు బాబు వచ్చాడు.. పెన్షన్ ఇచ్చాడు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 6, 2025
శబరిమలలో శ్రీకాకుళం జిల్లా వాసి మృతి

శబరిమలలో శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు పంచాయతీ కూటికుప్పలపేటకు చెందిన గురుగుబెల్లి వరాహ నరసింహులు (72) మృతి చెందారు. అయ్యప్ప దర్శనానికి వెళ్లగా శుక్రవారం గుండెపోటుతో మృతిచెందినట్లు తోటి భక్తులు మృతుని కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌లో స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువస్తున్నారు.
News December 6, 2025
శ్రీకాకుళం: టెట్ ఎగ్జామ్ సెంటర్‌లు ఇవే

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఈ నెల 10-21 వరకు జరగనుంది. జిల్లాలో సుమారు 12 వేల పైచిలుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. వీరికి ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
✦ఎగ్జామ్‌కు శ్రీకాకుళం జిల్లాలో కేటాయించిన కేంద్రాలు ఇవే:
➤ నరసన్నపేట-కోర్ టెక్నాలజీ
➤ఎచ్చెర్ల-శ్రీ శివానీ, శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల
News December 6, 2025
శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు అలర్ట్

శ్రీకాకుళం జిల్లా మీదుగా విశాఖకు నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. గరివిడి-సిగడాం-చీపురుపల్లి మధ్య భద్రతకు సంబంధించిన పనుల నేపథ్యంలో విశాఖ-పలాస-విశాఖ(67289/90) మెము రైలు, విశాఖ-బ్రహ్మపూర్-విశాఖ(58531/32) ప్యాసింజర్ రైలు, విశాఖ-బ్రహ్మపూర్-విశాఖ(18525/26) ఎక్స్ప్రెస్ ట్రైన్లు డిసెంబర్ 6-8వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.


