News December 2, 2024

SKLM: ట్రెజరీ గార్డు అనుమానాస్పద మృతి

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌లో ట్రెజరీ విభాగంలో గార్డుగా పని చేస్తున్న కానిస్టేబుల్ సవర జోక్యో (55) సోమవారం మృతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా మృతి చెందడంతో ఎస్.ఐ హరికృష్ణ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతి చెందడం వెనుక మరేదైనా కోణం ఉందేమోనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 14, 2025

శ్రీకాకుళం: సండే టాప్ న్యూస్ ఇవే

image

✦యువత ధర్మం పట్ల అవగాహాన పెంచుకోవాలి: ఎమ్మెల్యే మామిడి
✦నరసన్నపేట: డంపింగ్ యార్డులో మళ్లీ చెలరేగిన మంటలు
✦ పితాళినల్లూరులో ఎలుగులు హాల్ చల్
✦గంజాయి రహిత సమాజం నిర్మిద్దాం: జిల్లా ఎస్పీ
✦టెక్కలి: అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న స్థానికులు
✦రణస్థలం: వంతెన కోసం తీసిన గోతిలో పడి బైకర్ మృతి
✦లావేరు: ప్రమాదకరంగా మలుపులు
✦నరసన్నపేట పోలీస్ స్టేషన్‌కు ఎస్ఐ లేరు

News December 14, 2025

సంక్రాంతికి ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కేదెప్పుడు?

image

ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు ఉపాధి కోసం అధిక సంఖ్యలో వలస వెళ్తుంటారు. వీరంతా సంక్రాంతికి తమ సొంతూరికి వెళ్లేందుకు సిద్ధం కాగా.. ఇప్పటికే అన్ని రైళ్ల టికెట్లు పూర్తిగా బుక్ అయ్యాయి. హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్రకు ఒక్క ప్రత్యేక రైలు కూడా ప్రకటించలేదు. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకొని స్థానిక ప్రజా ప్రతినిధులు రైల్వే శాఖపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News December 13, 2025

SKLM: ‘సంక్రాంతి నాటికి రోడ్లపై గుంతల్లేకుండా చేయాలి’

image

సంక్రాంతి పండగ నాటికి జిల్లాలోని రహదారులను గుంతలు లేని రోడ్లుగా మార్చాలని, మంజూరైన పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్‌తో కలిసి ఆయన ఆర్అండ్‌బీ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. రూ.82 కోట్ల విలువైన 28 పనులు మంజూరయ్యాయని అన్నారు.