News November 22, 2024

SKLM: డిగ్రీ విద్యార్థుల ఆందోళన..!

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ విద్యార్థులు 2, 4 సెమిస్టర్లకు సంబంధించి ఆగస్టులో రీవాల్యుయేషన్ పెట్టారు. దాదాపుగా మూడు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఫలితాలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు స్పందించి ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారనేది ప్రకటించాలని విద్యార్థులు కోరుతున్నారు.

Similar News

News December 2, 2024

SKLM: శీతాకాలం వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: DM&HO

image

గ్రామాల్లో అభయ కార్డుల జారీ, క్యాన్సర్‌పై సర్వే ముమ్మరంగా సాగుతోందని డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ బొడ్డేపల్లి మీనాక్షి అన్నారు. ప్రజలు ఈ సర్వేలో తమ వివరాలను స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో వైరల్‌ జ్వరాలు, మలేరియా, డెంగీ, డయేరియా వంటి వ్యాధులు అదుపులో ఉన్నాయన్నారు. శీతాకాలం వ్యాధులు విజృంభించకుండా ఉండేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News December 1, 2024

శ్రీకాకుళం: ఎయిడ్స్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి

image

ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిక్ దినకర్ పుండ్కర్ అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని అంబేడ్కర్ కళా వేదికలో ఆదివారం ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించారు. ప్రస్తుతం ప్రజల్లో ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన ఉందన్నారు. భవిష్యత్తులో ఎయిడ్స్ రైతు సమాజం లక్ష్యంగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని సూచించారు. వ్యాధి నియంత్రణకు అధికార యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుంది.

News December 1, 2024

IPLకు విజయ్.. టెక్కలిలో అభినందనలు ఫ్లెక్సీ

image

టెక్కలికి చెందిన త్రిపురాన విజయ్ ఐపీఎల్- ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎంపిక కావడం పట్ల టెక్కలిలో విజయ్ స్నేహితులు, క్రికెట్ అభిమానులు, గ్రౌండ్ ప్లేయర్స్ విజయ్‌కు అభినందనలు తెలుపుతూ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం రోడ్డులో ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఐపీఎల్‌కు ఎంపికైన మొట్టమొదటి యువకుడు త్రిపురాన విజయ్‌కు “All The Best” చెప్తూ ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు.