News December 30, 2024
SKLM: దళారీల మాట నమ్మి మోసపోవద్దు: ఎస్పీ

కానిస్టేబుల్ శారీరక దేహదారుఢ్య పరీక్షలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించబడతాయని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. రిక్రూట్మెంట్కు సంబంధించిన ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ కల్పించే దళారీలు మాటలు నమ్మవద్దని చెప్పారు. అట్టి వివరాలు 6309990800, 6309990911 ఫోన్ నంబర్లకు తెలపాలని జిల్లా ఎస్పీ కోరారు. సమాచారం అందించిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ వెల్లడించారు.
Similar News
News October 24, 2025
ఎచ్చెర్ల: వర్సిటీలో క్యాంటీన్ నిర్వహణకు దరఖాస్తు గడువు పెంపు

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో క్యాంటీన్ నిర్వహణకు గడువు తేదీ పెంచినట్లు యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య బి.అడ్డయ్య పేర్కొన్నారు. ఈనెల 27వ తేదీలోగా https://www.brau.edu.in వెబ్సైట్లో దరఖాస్తు ఫారం సబ్మిట్ చేయాలని ఆయన కోరారు. గతంలో ప్రకటించిన తేదీకి దరఖాస్తులు రాకపోవడంతో గడువు పెంచినట్లు ఆయన తెలియజేశారు. పూర్తి వివరాలకు98662 99401 ఫోన్ నెంబర్కు సంప్రదించాలన్నారు.
News October 24, 2025
B.Ed పరీక్షల నోటిఫికేషన్ విడుదల

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ B.Ed 3వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.30/-లు, పరీక్షల ఫీజు రూ.1305/-లతో కలిపి మొత్తం రూ.1335/-లను నవంబర్ 10వ తేదీ లోపు చెల్లించాలని ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ సూచించారు. హాల్ టికెట్లు నవంబర్ 15న, పరీక్షలు 25వ తేదీన జరుగుతాయన్నారు.
News October 24, 2025
రణస్థలం: బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటోడ్రైవర్పై కేసు

బాలికపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్న ఆటో డ్రైవర్ రామారావుపై కేసు నమోదైంది. రణస్థలం SI వివరాల మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి అనారోగ్యం కారణంగా నిద్రపోవాలంటే మాత్ర వేసుకోవాల్సిందే. దీన్ని ఆసరాగా చేసుకున్న ఓ ఆటోడ్రైవర్ ఆయన కుమార్తెపై కన్నేశాడు. బాలిక తల్లికి మద్యం అలవాటు చేశాడు. వాళ్లు మత్తులో ఉండగా బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఇటీవల తండ్రికి విషయం తెలిసి ఫిర్యాదు చేశారు.


