News October 3, 2024
SKLM: దసరాకు ప్రత్యేక బస్ సర్వీసులు

దసరా సందర్భంగా విశాఖ నుంచి పలు ప్రాంతాలకు 250 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలరాజు తెలిపారు. ప్రత్యేక సర్వీసులకు ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవన్నారు. హైదరాబాద్‌కు 40, విజయవాడకు 40 నుంచి 50, రాజమండ్రి, కాకినాడ సెక్టార్‌కు 40 అదనపు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక సర్వీసులు నడుపుతామన్నారు.
Similar News
News December 8, 2025
శ్రీకాకుళం: ‘ధాన్యాన్ని అధనంగా తీసుకుంటున్నారు’

ధాన్యం కొనుగోళ్లలో కొనుగోలు కేంద్రాల వద్ద 3 నుంచి 5 కేజీలు అధనంగా రైతుల నుంచి మిల్లర్లు తీసుకుంటున్నారని ఏపీ రైతు సంఘం పీజీఆర్ఎస్లో సోమవారం ఫిర్యాదు చేసింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతి పత్రం అందజేశారు. నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని ప్రసాదరావు, చందర్రావు అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అధికారులు అమలు చేయాలని కోరారు.
News December 8, 2025
9 వరకు టెన్త్ ఫీజు చెల్లింపు గడువు పెంపు SKLM DEO

ఎటువంటి అపరాదరుసుం లేకుండా డిసెంబర్ 9 వరకు టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించవచ్చని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు సోమవారం తెలిపారు. రూ.50 ఫైన్‌తో 10 నుంచి 12 వరకు, రూ.200 ఫైన్‌తో 13 నుంచి 15 వరకు, రూ.500 ఫైన్‌తో 16 నుంచి 18వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. సంబంధిత పాఠశాలల హెచ్ఎంలకు సమాచారం తెలియజేశామన్నారు.
News December 8, 2025
SKLM: PG సెట్ లేకపోయినా.. సీట్ల కేటాయింపు

శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో MSC ఆర్గానిక్ కెమిస్ట్రీ, MSC మెడికల్ బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వై.పొలినాయుడు ఆదివారం తెలిపారు. PG సెట్ అర్హత లేకపోయినా ఉన్నత విద్యాశాఖ ఇచ్చిన మినహాయింపులు ప్రకారం అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


