News January 10, 2025
SKLM: దొంగలు వస్తారు..జాగ్రత్త

శ్రీకాకుళం పట్టణ ప్రజలకు రెండో పట్టణ సీఐ పలు సూచనలు చేశారు. సంక్రాంతి పండగకు గ్రామాలకు వెళ్లే పట్టణ ప్రజలు మీ విలువైన బంగారు ఆభరణాలు నగదు తీసుకుని వెళ్లాలని అన్నారు. లేకుంటే బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సీఐ చెప్పారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆయా స్టేషన్ పరిధిలోని గురువారం ప్రచారం రథాల ద్వారా పట్టణ ప్రజలను అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు.
Similar News
News December 8, 2025
9 వరకు టెన్త్ ఫీజు చెల్లింపు గడువు పెంపు SKLM DEO

ఎటువంటి అపరాదరుసుం లేకుండా డిసెంబర్ 9 వరకు టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించవచ్చని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు సోమవారం తెలిపారు. రూ.50 ఫైన్‌తో 10 నుంచి 12 వరకు, రూ.200 ఫైన్‌తో 13 నుంచి 15 వరకు, రూ.500 ఫైన్‌తో 16 నుంచి 18వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. సంబంధిత పాఠశాలల హెచ్ఎంలకు సమాచారం తెలియజేశామన్నారు.
News December 8, 2025
SKLM: PG సెట్ లేకపోయినా.. సీట్ల కేటాయింపు

శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో MSC ఆర్గానిక్ కెమిస్ట్రీ, MSC మెడికల్ బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వై.పొలినాయుడు ఆదివారం తెలిపారు. PG సెట్ అర్హత లేకపోయినా ఉన్నత విద్యాశాఖ ఇచ్చిన మినహాయింపులు ప్రకారం అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 8, 2025
SKLM: నేడు యథావిధిగా PGRS- కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్ కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.


