News October 19, 2024
SKLM: నవంబర్ 6 వరకు ఉపాధ్యాయ ఓటర్ల నమోదు

ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ఉపాధ్యాయులందరూ ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి సెప్టెంబరు 30వ తేదీన నోటిఫికేషన్ వెలువడిందని, అదే రోజు నుంచి ఓటు నమోదు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. నవంబర్ 6వ తేదీన ఓటర్గా నమోదుకు చివరి తేదీగా నిర్ణయించామని స్పష్టం చేశారు.
Similar News
News December 2, 2025
తమిళనాడు ప్రమాదం.. 3కి చేరిన శ్రీకాకుళం మృతుల సంఖ్య.!

రామేశ్వరం సమీపంలో కారు, టెంపో ట్రావెల్ బస్సును ఢీకొనగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచల, వీర రామచంద్రపురం (కొండూరు) గ్రామాలకి చెందిన ఇద్దరు యువకులు ఇల్లాకుల నవీన్ (25), పైడి సాయి(26) ఘటనా స్థలంలో మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన గుంటరాజు అనే యువకుడు మధురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.
News December 2, 2025
HIVకి భయపడవద్దు: శ్రీకాకుళం కలెక్టర్

హెచ్ఐవికి భయపడవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టర్ బంగ్లాలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 60మంది పిల్లలకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ప్రజలు హెచ్ఐవి పట్ల భయపడవద్దని, హెచ్ఐవి బాధితులను అక్కున చేర్చుకోవాలని, వారిపట్ల వివక్ష చూపరాదని సూచించారు. రిస్క్ గ్రూపులకు చెందినవారు నిరంతరం హెచ్ఐవి పరీక్షలు చేయించుకోవాలన్నారు.