News December 27, 2024

SKLM: నెమలి పింఛంపై కనకమహాలక్ష్మి దేవి చిత్రం

image

శ్రీకాకుళం నగరానికి చెందిన వాడాడ రాహుల్ పట్నాయక్ శుక్రవారం నెమలి పింఛంపై వేసిన కనకమహాలక్ష్మీ దేవి చిత్రం ఆకట్టుకుంది. రాహుల్ ఇటీవల జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో చిత్రాలకు ఎన్నో పురస్కారాలు పొందారు. పక్షుల వెంట్రుకలపై శ్రీనివాస కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీకృష్ణ రాసలీల తదితర దేవతల చిత్రాలు వేశారు. పాఠశాలల గోడలపై ఎన్నో విద్యా సంబంధిత బొమ్మలు వేసి పలువురు ప్రశంసలు పొందారు.

Similar News

News November 26, 2025

టెక్కలి: సెప్టిక్ ట్యాంక్‌లో పడి చిన్నారి మృతి

image

టెక్కలిలోని మండాపోలం కాలనీకి చెందిన కొంకి భవ్యాన్ (5) బుధవారం సాయంత్రం సెప్టిక్ ట్యాంక్‌లో పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. సాయంత్రం తన ఇంటికి సమీపంలో ఆడుకుంటూ ఉండగా నిర్మాణ దశలో ఉన్న మరో ఇంటికి చెందిన సెప్టిక్ ట్యాంక్‌లో ప్రమాదవశాత్తు పడిపోవడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News November 26, 2025

SKLM: ఎస్పీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం

image

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం భారత రాజ్యాంగం దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి పునాది అని అన్నారు. అంబేడ్కర్ చిరస్మరణీయులని ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. చట్ట పాలనను సాగించడంలో పోలీసులు ముందుండాలన్నారు.

News November 26, 2025

ఘోర ప్రమాదం.. ఇద్దరు సిక్కోలు వాసుల మృతి

image

తమిళనాడు రామేశ్వరం సమీపంలో లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పలాస(M) పెదంచల, వీర రామచంద్రపురం గ్రామాలకు చెందిన ఇద్దరు మృతిచెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అయ్యప్పమాల ధరించి పలువురు శబరిమలై, రామేశ్వరం వెళ్లి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు ఇల్లాకుల నవీన్(24), పైడి సాయి(26)గా పోలీసులు గుర్తించారు. గుంట రాజు, పైడి తారకేశ్వరరావు, పైడి గణపతి, తమ్మినేని గణేశం గాయపడ్డారు.