News January 20, 2025
SKLM: నేటి నుంచి ఉచిత పశు వైద్య శిబిరాలు

శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 20 నుంచి 31వతేదీ వరకు అన్ని మండలాల్లో రోజుకు రెండు పంచాయితీల చొప్పున పశు వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆ శాఖ జేడీ డాక్టర్ కె.రాజ్ గోపాల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా గ్రామాల్లో ఉదయం 8 గంటల నుంచి ఈ శిబిరాలు నిర్వహిస్తామని, పశువులకు సాధారణ చికిత్సలు, గర్భకోస వ్యాధులకు పరీక్షలు చేసి మందులు అందిస్తామన్నారు.
Similar News
News February 8, 2025
నందిగాం: తమ్ముడి చితికి అక్క అంత్యక్రియలు

నందిగం మండలం హరిదాసు పేట గ్రామంలో శుక్రవారం తమ్ముడి మృత దేహానికి అక్క అంత్యక్రియలు నిర్వహించిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన కణితి. సుధాకర్ (24) అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. తన తండ్రి మూడు సంవత్సరాల కిందట మరణించారు. తల్లి కంటి చూపు సమస్యతో బాధపడుతుంది. భార్య విడాకులు తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో సోదరి కృష్ణవేణి తమ్ముడు సుధాకర్‌కు దహన సంస్కారాలు చేసింది.
News February 7, 2025
పొందూరు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

పొందూరులో రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల అందించిన సమాచారంతో ఏస్.ఐ మధుసూదన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి సుమారు (45)ఏళ్ల వయసు ఉంటుందన్నారు. బిస్కెట్ కలర్ షర్ట్, బ్లూ కలర్ షార్ట్ ఉందని వివరాలు తెలిస్తే 94934 74582 నంబరును సంప్రదించాలని కోరారు.
News February 7, 2025
శ్రీకాకుళం: యాచనకు వచ్చి.. మహిళపై దాడి

యాచనకు వచ్చిన ఓ మహిళ గురువారం రాత్రి శ్రీకాకుళం నగరానికి చెందిన గృహిణిపై దాడి చేసింది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. సీమనాయుడుపేటకు చెందిన జయలక్ష్మి కుటుంబం సభ్యులు అందరూ బయటకు వెళ్లారు. ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్న సమయంలో ఒక మహిళ యాచనకు వచ్చి ఒంటరిగా ఉన్న ఆమెపై దాడి చేసింది. ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకునేందుకు ప్రయత్నించగా జయలక్ష్మి ప్రతిఘటించి కేకలు వేసింది. స్థానికులు రావడంతో ఆ మహిళ పరారైంది.