News February 20, 2025
SKLM: నేడు జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

శ్రీకాకుళం జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు గురువారం జరగనున్నాయి. ఉదయం 10.30 గంటల నుంచి జడ్పీ సమావేశ మందిరంలో సమావేశాలు ప్రారంభం అవుతాయని జడ్పీ సీఈవో ఎల్ఎన్ఏవీ శ్రీధర్ రాజా తెలిపారు. 10.30 గంటల నుంచి 6వ స్థాయీ, 11.30 గంటలకు 3వ, 12.30 గంటల నుంచి 5వ, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి వరుసగా 2వ, 4వ, 1వ, 7వ స్థాయీ సంఘ సమావేశాలు జరుగుతాయని ప్రకటించారు.
Similar News
News November 13, 2025
మస్కట్లో సిక్కోలు యువతి అనుమానాస్పద మృతి

ఆమదాలవలస మండలం వెదుర్లువలసకి చెందిన నాగమణి (28) జీవనోపాధి కోసం మస్కట్ వెళ్లి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఆమె వారం రోజుల క్రితం ఇంటికి ఫోన్ చేసి అక్కడ తనను వేధిస్తున్నారని చెప్పిందని, ఇంతలోనే ఏజెంట్ ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పినట్లు ఆమె తల్లి తెలిపారు.MLA రవికుమార్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామన్నారు.
News November 13, 2025
సరుబుజ్జిలి: చెరువులో మహిళ మృతదేహం లభ్యం

సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన ఏ.శకుంతల (48) అనే మహిళ బుధవారం గ్రామ సమీపంలోని చెరువులో మృతి చెందింది. ఈ మేరకు మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ B.హైమావతి ఘటప స్థలాని చేరుకుని మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సరుబుజ్జిలి పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
News November 13, 2025
ప్రభుత్వ చౌక ధరల డిపోలను తనిఖీ చేసిన రాష్ట్ర కమిషనర్

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ రోణంకి గోవిందరావు బుధవారం సోంపేటలో ఉన్న ప్రభుత్వ చౌక ధరల దుకాణాలను తనిఖీ చేశారు. డీలర్లు సరుకులు ప్రజలకు సంతృప్తి కలిగే విధంగా సరఫరా చేయాలని ఆదేశించారు. పంపిణీ సమయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేసిన, అక్రమాలకు పాల్పడిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం బారువాలో ఉన్న డిపోలను పరిశీలించారు. పంపిణీ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.


