News October 1, 2024

SKLM: పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి-కలెక్టర్

image

శ్రీకాకుళం నగరంలోని అక్టోబర్ 2న R&B అతిథి గృహం డచ్ బిల్డింగ్ వద్ద జిల్లాస్థాయి స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిసరాలను, నిర్వహణ ఏర్పాట్లను జిల్లా అధికారులతో సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏ ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు. ఈ సమావేశానికి అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరారు.

Similar News

News December 20, 2025

SKLM: RTC డోర్ డెలివరీ పార్సిల్ ప్రారంభం

image

ఆర్టీసీ సంస్థలో పార్సిల్ డోర్ డెలివరీ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ కార్గో పార్సిల్ కౌంటర్ వద్ద శనివారం ప్రారంభించారు. 50 కేజీల బరువున్న పార్సిల్ 10 కిలోమీటర్లు దూరం పరిధిలో ఉన్న స్థలాలకు సురక్షితంగా పంపించడం జరుగుతుందన్నారు. ఈ నెల 20 నుంచి జనవరి 19 వరకు డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 84 పట్టణాల్లో ఈ సేవలను ప్రారంభించాన్నారు.

News December 20, 2025

శ్రీకాకుళం: హాట్ హాట్‌గా జడ్పీ సర్వసభ్య సమావేశం

image

శ్రీకాకుళంలో జడ్పీ సర్వసభ్య సమావేశం హాట్ హాట్‌గా సాగుతోంది. ఉపాధి హామీ నిధుల వినియోగం, సచివాలయాలు, RBKల నిర్మాణాల పనుల బిల్లులు రాలేదని సభ్యులు ప్రశ్నించగా సంబంధిత అధికారులు బిల్లులు వచ్చాయని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే కూన రవికుమార్ కలగజేసుకున్నారు. అయితే కేవలం వైసీపీనే టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ సభ్యులు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. పరస్పర ఆరోపణలతో సభ హీట్ ఎక్కింది.

News December 20, 2025

వజ్రపుకొత్తూరు: బీచ్‌లో వెనక్కి వెళ్లిన సముద్రం

image

వజ్రపుకొత్తూరు మండలంలోని శివ సాగర్ బీచ్‌లో సముద్రం వెనక్కి వెళ్లింది. ఒక్కసారిగా 50 మీటర్ల మేర వెనకకు వెళ్లడంతో పర్యాటకులు ఈ వింతను చూసేందుకు తరలివచ్చారు. దీనికి తోడు ఎంతో తక్కువ ఎత్తులో అలలు ఎగిసిపడుతూ ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ వాతావరణాన్ని పర్యాటకులు ఆస్వాదించారు. గత రెండు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు.