News June 7, 2024
SKLM: పడవ బోల్తా పడి మత్స్యకారుడు మృతి

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన మూగి యర్రయ్య (55) శుక్రవారం ఉదయం సముద్రంలో వేటకు వెళ్లి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఎర్రయ్య తన సహచరులతో వేటకు వెళ్లిన కొద్దిసేపటికి పడవ అదుపుతప్పి నడి సముద్రంలో బోల్తా పడింది. మత్స్యకారులు ఈదుకుంటూ బోల్తా పడిన తెప్ప పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకోగా ఎర్రయ్యకు గాయాలు కావడంతో నీటిలో మునిగి మృతి చెందాడు.
Similar News
News December 4, 2025
SKLM: ‘ప్రజలు సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత’

క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సైతం యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడంపైనే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. సచివాలయం నుంచి గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీఎం కుసుమ పథకం కింద ఉన్న భూమి వివాదాలు, ఎరువులు సరఫరా లోపాలు, పెన్షన్ల పంపిణీలో పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలన్నారు.
News December 4, 2025
ఈనెల 7న NMMS ప్రతిభా పరీక్ష: DEO

ఈనెల 7న NMMS ప్రతిభ పరీక్ష ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి కే.రవిబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రెవెన్యూ డివిజన్లలోని 25 కేంద్రాల్లో పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షకు 5,627 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందించాలని కోరారు.
News December 4, 2025
SKLM: ‘ఆలయాల్లో దొంగతనాలు చేసిన ముగ్గురి అరెస్ట్’

జిల్లాలో పలు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.1,71,000 స్వాధీనం చేసుకున్నట్లు శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద గురువారం వెల్లడించారు. డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు. ఈ ముగ్గురూ గతంలో ఆముదాలవలసలో మోటార్ బైకుల దొంగతనం కేసులో 45 రోజులు జైలు శిక్ష అనుభవించినట్లు కూడా డీఎస్పీ వెల్లడించారు.


