News October 19, 2024
SKLM: పథకాలు లబ్ధిదారులకు శతశాతం అందజేయాలి

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాలు లబ్ధిదారులకు శతశాతం అందజేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ మందిరంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన జిల్లా స్థాయిలో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించారు. లబ్ధిదారులకు శతశాతం అందజేసేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.
Similar News
News December 4, 2025
ఎచ్చెర్ల: రిజల్ట్స్ వచ్చాయి

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ LLB 2, 4, 6, 8, 10వ సెమిస్టర్ల పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈమేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ ఉదయ్ భాస్కర్ బుధవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రిజల్ట్స్ను అధికారిక వెబ్ సైట్ https://brau.edu.in/లో పొందుపరిచామన్నారు. 95 మందికి 84 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
News December 4, 2025
గర్భస్థ లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం: DM&HO

గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని DM &HO అనిత స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం లింగ ఆధారిత హింస నివారణ, మెడికో లీగల్ కేర్పై శిక్షణ కార్యక్రమం జరిగింది. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న హింసలను అరికట్టి, లింగ వివక్ష చూపరాదని డీఎంహెచ్వో తెలియజేశారు.
News December 3, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

➤కోటబొమ్మాళిలో జేసీ ఆకస్మిక తనిఖీ
➤పాతపట్నం: లగేజీ ఆటో బోల్తా.. బాలుడికి గాయాలు
➤మనుషుల నుండి Scrub Typhus వ్యాపించదు: DMHO
➤శ్రీకాకుళం: ప్రజా ఉద్యమంపై ఉక్కుపాదం వద్దు
➤రైతుసేవలో కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే బగ్గు
➤మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే శిరీష
➤మందస: నరకాన్ని తలపిస్తున్న రహదారులు


