News February 17, 2025
SKLM: పది పరీక్షలకు 149 సెంటర్లు

శ్రీకాకుళం జిల్లాలో 28,984 మంది 10వ తరగతి ఫైనల్ పరీక్షలు రాయనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 149 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 149 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, ఏడు ఫ్లైయింగ్ స్క్వాడ్స్ విధులు నిర్వర్తిస్తాయని చెప్పారు. అలాగే 8 పరీక్షా కేంద్రాల్లో 807 మంది APOSS SSC పరీక్షలు రాస్తారన్నారు.
Similar News
News February 26, 2026
శ్రీకాకుళం జిల్లాకు కొత్త ఆఫీసర్

శ్రీకాకుళం జిల్లా పంచాయతీ అధికారిగా కె. గోపి బాలను ప్రభుత్వం నియమించింది. బుధవారం రాత్రి ప్రస్తుతం డీపీవోగా పనిచేస్తున్న భారతి సౌజన్యను బదిలీ చేశారు. గోపి బాల శ్రీకాకుళం డివిజనల్ పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తుండగా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం.
News February 26, 2026
డయేరియా.. శ్రీకాకుళానికి రూ.118 కోట్లు

శ్రీకాకుళం నగరంలో తాగునీరు, డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి పనుల కోసం రూ.118 కోట్లు కేటాయిస్తున్నామని మంత్రి నారాయణ బుధవారం వెల్లడించారు. దమ్మలవీధి, మొండేటి వీధి, కండ్రవీధి, ఎచ్చెర్ల వీధి ప్రాంతాల్లో ప్రబలిన డయేరియా అదుపులోకి వచ్చిందన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి బాధిత ప్రాంతాల్లో పర్యటించారు.
News February 25, 2026
శ్రీకాకుళం: రెండు వారాల వ్యవధిలో ఇద్దరు కమిషనర్లు అవుట్..!

శ్రీకాకుళం నగరపాలక సంస్థ పాలనా యంత్రాంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. రెండు వారాల వ్యవధిలో ఇద్దరు కమిషనర్లపై వేటు పడింది. ఒకరు బదిలీ కాగా.. మరొకరిపై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో నగర పాలక సంస్థ కమిషనర్‌గా పనిచేసిన దుర్గా ప్రసాద్ రెండు వారాల కిందట ఆకస్మికంగా బదిలీపై వెళ్లారు. ప్రస్తుత కమిషనర్ కూర్మారావు వచ్చి 2 వారాలు గడవక ముందే డయేరియా నేపథ్యంలో సస్పెన్షన్ ఎదుర్కొన్నారు.


