News November 18, 2024

SKLM: పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజు గడువు పెంపు

image

పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు పొడిగించినట్లు జిల్లా విద్యా శాఖ అధికారి (DEO) తిరుమల చైతన్య సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 26వ తేదీలోగా చెల్లించాలని సూచించారు. రూ.50 అపరాధ రుసుంతో డిసెంబర్ 02, రూ.200 అపరాధ రుసుంతో డిసెంబర్ 9, రూ.500 రుసుంతో డిసెంబర్ 16 ఆఖరి తేదీ అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Similar News

News February 26, 2026

శ్రీకాకుళం: పాత పైప్‌లైన్ల తొలగింపు

image

శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడానికి నీటి కాలుష్యమే ప్రధాన కారణమని భావిస్తున్న అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ట్యాంకర్ల ద్వారా స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారు. డ్రైనేజీల పక్కన ఉన్న పాత పైప్‌లైన్లను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. సేకరించిన 412 వాటర్ శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం విశాఖపట్నం ల్యాబ్‌లకు పంపగా, ప్రాథమిక రిపోర్టుల ప్రకారం నీరు సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం.

News February 26, 2026

శ్రీకాకుళం: గూడ్స్ రైలు నుంచి విడిపోయిన బోగీలు

image

మందస మండలం మకరజోల వద్ద విశాఖ నుంచి కోల్‌కతా వైపునకు వెళ్తున్న గూడ్స్ రైలు ఆరు బోగీలు విడిపోయాయి. మిగిలిన బోగీలతో 100 మీటర్లు ముందుకు వెళ్లి నిలిపివేశారు. దీంతో మకరజోల మీదుగా ఉద్దానం గ్రామాలకు వెళ్లే రహదారిపై రైలు క్రాసింగ్ వద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు గంటపాటు ఇబ్బందులు పడ్డారు.

News February 26, 2026

శ్రీకాకుళం జిల్లాకు కొత్త ఆఫీసర్

image

శ్రీకాకుళం జిల్లా పంచాయతీ అధికారిగా కె. గోపి బాలను ప్రభుత్వం నియమించింది. బుధవారం రాత్రి ప్రస్తుతం డీపీవోగా పనిచేస్తున్న భారతి సౌజన్యను బదిలీ చేశారు. గోపి బాల శ్రీకాకుళం డివిజనల్ పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తుండగా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం.