News February 14, 2026
SKLM: ‘పరీక్షలు నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉంది’

త్వరలో జరగనున్న ఇంటర్మీడియట్, 10th పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర రాజధాని సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కే.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ సరఫరా, ఫర్నిచర్ వంటి మౌళిక సౌకర్యం కల్పిస్తామన్నారు.
Similar News
News March 12, 2026
ఎచ్చెర్ల: ఐఐఐటీ కొత్త ఇన్‌ఛార్జ్ డైరక్టర్ ఎవరంటే?

శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఐఐఐటీ) ఇన్‌ఛార్జ్, డైరెక్టర్‌గా రిజిస్ట్రార్ అమరేంద్ర కుమార్‌ను నియమిస్తూ ఇన్‌ఛార్జ్, ఛాన్సలర్ మధుమూర్తి బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుత డైరెక్టర్ కొక్కిరాల వెంకట గోపాల ధన బాలాజీని రిలీవ్ చేస్తూ ఓ ప్రకటన చేశారు.
News March 12, 2026
SKLM: రాష్ట్ర స్థాయి కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం అమరావతిలో జరుగుతున్న రాష్ట్రస్థాయి 6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు నివేదికను ఉన్నతాధికారులకు తెలియజేశారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు.
News March 11, 2026
కోటబొమ్మాళి: భర్తపై భార్య దాడి

భర్తపై భార్య దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన కోటబొమ్మాళి మండలం మంచాలపేటలో జరిగింది. భర్తను సోదరిడితో కలిసి ఓ గదిలో బంధించి కొట్టగా తీవ్ర గాయాలపాలయ్యాడు. అనంతరం గమనించిన కుటుంబీకులు తక్షణం సమీప ఆసుపత్రిలో చేర్చారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


