News September 15, 2024

SKLM: పర్యాటక అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని 2023-24కు గాను ప్రకటించిన వివిధ అవార్డులకు అర్హులైన పర్యాటక సంబంధిత రంగాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మొత్తం 38 విభాగాల నుంచి 41 అవార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పారు. దరఖాస్తులను ఏపీ టూరిజం వెబ్సైట్ www.aptourism.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని పూర్తి సమాచారం ఉందన్నారు.

Similar News

News February 24, 2026

శ్రీకాకుళం: జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీల నిర్వహణ

image

శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో మంగళవారం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. అండర్-18 పురుషులు, మహిళల విభాగంలో ఈ పోటీలు జరిగాయి. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మహేశ్ బాబు పోటీలను పర్యవేక్షించారు. విజేతలు ఈనెల 28న ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

News February 24, 2026

శ్రీకాకుళం: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షకు 312 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలోని 71 పరీక్షా కేంద్రాల్లో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షకు 312 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఆర్ఐఓ ఆర్.సురేష్ కుమార్ తెలిపారు. మొత్తం 19,158 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 18,840 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు పేర్కొన్నారు. 98.34 హాజరు శాతం నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు.

News February 24, 2026

శ్రీకాకుళం నాయకులతో లోకేశ్ ఆత్మీయ సమావేశం

image

మంగళగిరిలో ఐటి విద్యాశాఖ మంత్రి శ్రీకాకుళం నాయకులతో సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. వారి కుటుంబాలతో మంత్రి లోకేశ్ ఆత్మీయంగా మాట్లాడారు. వారికి కానుకలు అందజేశారు. యోగక్షేమాలు అడుగుతూ సరదాగా గడిపారు.