News September 15, 2024
SKLM: పర్యాటక అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని 2023-24కు గాను ప్రకటించిన వివిధ అవార్డులకు అర్హులైన పర్యాటక సంబంధిత రంగాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మొత్తం 38 విభాగాల నుంచి 41 అవార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పారు. దరఖాస్తులను ఏపీ టూరిజం వెబ్సైట్ www.aptourism.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని పూర్తి సమాచారం ఉందన్నారు.
Similar News
News October 9, 2024
కొవ్వాడ ఆర్ అండ్ ఆర్ పనులు వేగవంతం చేయాలి
కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ధర్మవరం వద్ద నిర్మిస్తున్న ఆర్ అండ్ ఆర్ కాలనీలో అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ ఆహ్మద్‌తో కలిసి సంబంధిత అధికారులతో బుధవారం ఆయన తన కార్యాలయంలో సమావేశమయ్యారు. అప్రోచ్ రోడ్డు పెండింగ్ పనులపై, నిర్వాసితులకు చెల్లించాల్సిన పెండింగ్ నష్ట పరిహారాలపై చర్చించారు.
News October 9, 2024
శ్రీకాకుళం: ఇసుక లోడింగ్‌కు టెండర్ల ఆహ్వానం
జిల్లాలో మొత్తం 6 రీచ్ల వద్ద ఇసుకను మనుషులతో తవ్వకాలు చేసి నిల్వ కేంద్రానికి తరలించి, వినియోగదారుల వాహనాలకు లోడ్ చేసేందుకు గాను టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. జిల్లా భూగర్భ గనులశాఖ కార్యాలయం (కిమ్స్ ఆసుపత్రి వెనుక)లో ఈ నెల 11న ఉదయం 11 గంటల్లోగా సీల్డు టెండర్ల బిడ్ డాక్యుమెంట్లను స్వీకరించనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.
News October 9, 2024
శ్రీకాకుళం: నీటి సంఘాల ఎన్నికలకు సిద్ధం కావాలి
సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మంగళవారం ఆయన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్‌తో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులతో చిన్న నీటి పారుదల ప్రాజెక్టుల వారీగా సాగునీటి సంఘాలకు వచ్చే నెల నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించారు. అందుకు తగ్గ ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలన్నారు.