News September 14, 2024

SKLM: పలాస జీడిపప్పు .. శ్రీనివాసుడి చెంతకు..!

image

అంతర్జాతీయ స్థాయిలో పలాస ఉద్దానం జీడిపప్పు నోరురుంచేది. ఇప్పుడు TTD ప్రసాదం లడ్డూ రూపంలో యాత్రికుల చెంతకు చేరనుంది. జాతీయ స్థాయిలో తిరుపతి వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదానికి వినియోగించే వస్తువుల్లో జీడిపప్పు కూడా ప్రధాన భూమిక పోషిస్తోంది. ఇకపై ఈ లడ్డూలో పలాస జీడిపప్పుకు స్థానం దక్కనుంది. ఇటీవల టెండర్లు వేయగా పలాసకు చెందిన వ్యాపారి కోరాడ సంతోష్‌ TTDకి జీడిపప్పు సరఫరా చేసే భాగ్యం లభించింది.

Similar News

News February 28, 2026

శ్రీకాకుళం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా రూపలత

image

శ్రీకాకుళం జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిగా (ఐసీడీఎస్ పీడీ) కె.రూపలత శనివారం నియమితులయ్యారు. ప్రస్తుతం రణస్థలం మండలం సీడీపీవోగా విధులు నిర్వర్తిస్తున్న ఈమెకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో పీడీగా పనిచేసిన జయదేవి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఆమెకు కార్యాలయం సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

News February 28, 2026

SKLM: 19 పోస్ట్ ఆఫీసుల్లో ఆధార్ సేవలు

image

శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలో గల 19 తపాలా కేంద్రాల్లో పూర్తిస్థాయి ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయని పోస్టల్ సూపరింటెండెంట్ వి.హరిబాబు శనివారం తెలిపారు. శ్రీకాకుళం, ఆముదాలవలస, టెక్కలి ప్రధాన కార్యాలయాలతో పాటు రాజాం, పొందూరు, ఎస్.ఆర్.పురం, జె.ఆర్.పురం, అరసవల్లి, గార, హిరమండలం, కొత్తూరు, నరసన్నపేట, కోటబొమ్మాళి, పలాస, కాశీబుగ్గ, ఇచ్చాపురం, సోంపేట, మందస కేంద్రాల్లో సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

News February 28, 2026

శ్రీకాకుళం: ఆ మారణహోమం జరిగి నేటికి 15 ఏళ్లు పూర్తి

image

సంతబొమ్మాళి(M) కాకరపల్లి థర్మల్ ప్లాంట్ వ్యతిరేక పోరాటయోధులపై పోలీసులు కాల్పులు జరిపి నేటికి 15 ఏళ్లు పూర్తయింది. ఈస్ట్ కోస్ట్ సంస్థ తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను వ్యతిరేకిస్తూ 2011 ఫిబ్రవరి 28వ తేదీన స్థానికులు ఆందోళన చేపట్టారు. వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు ఆందోళనకారులు మరణించగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పర్యావరణ శాఖ ఈ ప్లాంట్‌ నిర్మాణాన్ని రద్దు చేసింది.