News June 15, 2024
SKLM: పాలిటెక్నిక్ మొదటి విడత సీట్ల కేటాయింపు ఎలా

పాలిటెక్నిక్ మొదటి విడత సీట్ల కేటాయింపు ముగిసింది. కళాశాలల వారీగా జరిగిన ప్రవేశాలు పరిశీలిస్తే SKLM ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 297 సీట్లకు 268, SKLM ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో 99 సీట్లకు 94, ఆమదాలవలస పాలిటెక్నిక్‌లో 132కి 127, టెక్కలి ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 118కి 98, సీతంపేటలో 108కి 31, టెక్కలి ఐతం పాలిటెక్నిక్‌లో 462కి 361, ఎచ్చెర్ల వెంకటేశ్వర 462కి 340, మందికి ప్రవేశాలు జరిగాయి.
Similar News
News February 27, 2026
SKLM: డయేరియా ప్రాంతంలో కఠిన నిబంధనలు

శ్రీకాకుళంలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్, ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ అహమ్మద్ ఫర్మాన్ ఖాన్ గురువారం కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. మంగువారితోట దమ్మలవీధి కాకివీధి మేదరివీధి ప్రాంతాల్లో డయేరియా అదుపులోకి వచ్చినంత వరకు మాంసం విక్రయాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News February 27, 2026
శ్రీకాకుళం: డయేరియాపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సీరియస్

శ్రీకాకుళంలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా యంత్రాంగం, మున్సిపల్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తాగునీరు, మురికి కాలువల నిర్వహణ, పరిశుభ్రత విషయంలో అధికారులు జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.