News November 28, 2024
SKLM: పులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

సంతబొమ్మాళి మండలంలో పులి సంచారం సమాచారంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. పులి దాడిలో ఒక ఆవు మృతి చెందిందని అధికారులు తెలపడంతో ఆయన అధికారులతో మాట్లాడారు. అటవీ శాఖ అధికారులతో ఆయన సమాచారం ఆరా తీశారు. పెద్ద పులి ఆనవాళ్లు గుర్తించామని, ఒడిశా నుంచి పులి టెక్కలి వైపు వచ్చి ఉంటుందని అధికారులు తెలిపారు. అక్కడి ప్రజలు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లకుండా అవగాహన కల్పించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.
Similar News
News January 8, 2026
SKLM: ఉద్యోగాల దరఖాస్తులకు నేడే లాస్ట్ ఛాన్స్

శ్రీకాకుళం జిల్లాలోని మోడల్ స్కూల్ లలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునేందుకు గడువు గురువారంతో ముగియనుంది. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని మోడల్స్ స్కూళ్లలో దాదాపు 15 పోస్టుల ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రవిబాబు ఇటీవల ఓ ప్రకటనలో వెల్లడించారు. మరిన్ని వివరాలకు డీఈవో కార్యాలయాన్ని సందర్శించాలని దరఖాస్తులను ఆయా మోడల్ స్కూల్లలో సమర్పించవచ్చని ఆయన సూచించారు.
News January 8, 2026
శ్రీకాకుళం జిల్లాలో అష్ట ఈవోలేనా?

శ్రీకాకుళం జిల్లాలోని దేవాదాయశాఖలో ఈఓల(Executive Officers) కొరత ఉన్నట్లు సమాచారం. దీంతో జిల్లాలోని ప్రముఖ దేవస్థానాల్లో పర్యవేక్షణతో పాటు ఎండోమెంట్ భూముల పరిరక్షణ కొరవడుతోంది. జిల్లాలో దేవాదాయశాఖ పరిధిలో 795 ఆలయాలకు కేవలం 8 మంది ఈఓలు విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు ఈఓలు నాలుగు నెలలలో ఉద్యోగ విరమణ కానున్నారు. దీంతో దేవాదాయశాఖ అంశాల పర్యవేక్షణ మరింత క్లిష్టతరమవుతోంది.
News January 8, 2026
గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అధికారి

మందస మండలం రాధాకృష్ణపురం సమీపంలోని డా. బి.ఆర్ అంబేడ్కర్ గురుకులాన్ని జిల్లా సమన్వయ అధికారి వై.యశోద లక్ష్మి బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. మెనూ, వంటశాల, భోజనశాల, సరుకుల గదిని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం గురుకులంలో పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు తమ బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలని సూచించారు.


