News March 2, 2025
SKLM: పెండింగ్ కేసులపై దర్యాప్తు వేగవంతం చేయాలి

శ్రీకాకుళం జిల్లాలోని ప్రతి పోలీసు స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులు దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని ఏఎస్పీలు కెవి రమణ, పి. శ్రీనివాసరావు సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పెండింగ్లో ఉన్న కేసులు, మహిళా సంబంధిత నేరాలు, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర కేసులపై నేర సమీక్ష నిర్వహించారు. వీటిపై త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి నిందితులపై ఛార్జ్ షీట్ దాఖలు కోర్టులో చేయాలన్నారు.
Similar News
News March 23, 2025
అరసవల్లి ఆదిత్యుని నేటి ఆదాయం

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేణా రూ.3,76,300/- లు, పూజలు, విరాళాల రూపంలో రూ.1,41,803/-లు, ప్రసాదాలకు రూ.1,73,720/-లు,శ్రీ స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారు.
News March 23, 2025
ఎచ్చెర్ల రోడ్డు ప్రమాదంలో టెక్నీషియన్ మృతి

ఎచ్చెర్ల హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన దేశరాజ వెంకట కిరణ్ కుమార్(40) ఆదివారం ఎచ్చెర్ల కేశవరెడ్డి స్కూల్ వద్ద జంక్షన్ దాటుతుండగా రాజాం నుంచి వస్తున్న క్యాబ్ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎచ్చెర్లలో రూమ్ తీసుకొని రణస్థలం ప్రభుత్వాసుపత్రి CHCలో టెక్నీషియన్‌గా చేస్తున్నాడు. ఎస్సై సందీప్ కేసు నమోదు చేశారు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
News March 23, 2025
ఎచ్చెర్ల: ఆరుగురిపై క్రిమినల్ కేసులు

కుప్పిలి ఆదర్శ పాఠశాల విద్యార్థుల మాస్ కాపీయింగ్‌కు ఉపాధ్యాయులు సహకరించారని శ్రీకాకుళం డీఈఓ తిరుమల చైతన్య ఎచ్చెర్ల పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆరుగురు ఉపాధ్యాయులతోపాటు మరికొందరి పాత్ర ఉందని డీఈఓ ఫిర్యాదు చేయగా ఎఫ్ఎఆర్‌లో వారి పేర్లు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ. సందీప్ కుమార్ చెప్పారు.